Andhra Pradesh: స్వయంగా రంగంలోకి దిగి రోడ్లపై గుంతలు పూడ్చివేయించిన పోలీసులు

రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదాల్లో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉంటారు. అతివేగంగా వాహనాలు నడిపినప్పుడు అలాగే.. సరైన రోడ్లు లేక వాహనాలు అదుపుతప్పినప్పడు అత్యధికంగా ప్రమదాలు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే చాలావరకు గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాలు, ఆఖరికీ జాతీయ రహాదారుపై కూడా గుంతలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి.

Andhra Pradesh: స్వయంగా రంగంలోకి దిగి రోడ్లపై గుంతలు పూడ్చివేయించిన పోలీసులు
Police

Edited By:

Updated on: Oct 02, 2023 | 6:47 PM

రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రమాదాల్లో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉంటారు. అతివేగంగా వాహనాలు నడిపినప్పుడు అలాగే.. సరైన రోడ్లు లేక వాహనాలు అదుపు తప్పినప్పడు అత్యధికంగా ప్రమదాలు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే చాలావరకు గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాలు, ఆఖరికి జాతీయ రహాదారులపై కూడా గుంతలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అయితే చాలా వరకు రోడ్లపై ఇలా గుంతలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోరు. వాటిని అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల ఆ రోడ్లపై ప్రయాణించే వాహనాదారులు ముప్పు తిప్పలు పడుతుంచారు. అలాగే ఈ గుంతలు ఉండటం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. మరికొన్ని చోట్లలో కొత్తగా రోడ్లు వేసిన కొన్ని నెలలకే అవి ధ్వంసమైపోతుంటాయి. ముఖ్యంగా భారీ వర్షాలు కరిసినప్పుడు రోడ్లకు రోడ్లే తెగిపోతుంటాయి.

అయితే రోడ్డు ప్రమాదాలు జరిగితే కేసులు పెట్టడం కంటే అసలు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అక్కడి పోలీసులు. అనడమే కాదు స్వయంగా రంగంలోకి దిగి గుంతలు పడ్డ రోడ్లను పూడ్చే పనిలో పడ్డారు. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాల కడుపుకోతను కొంతలో కొంతైనా నివారించేందుకు పూనుకుంటున్నారు. రద్దీగా ఉండే రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతుండటంతో ఆ గుంతలను పూడ్చి స్థానికులతో శభాష్‌ అనింపించుకున్నారు. ప్రకాశం జిల్లా పామూరివారిపల్లి గ్రామంలో రోడ్డుకు మరమ్మత్తులు చేయించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.

అక్కడ కేవలం లా అండ్ ఆర్డర్‎ను పరిరక్షించడమే కాదు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరువారిపల్లి గ్రామ సమీపంలో ప్రమాదకరంగా మారిన రోడ్డుకు పోలీసులు మరమ్మత్తులు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించారు. అయితే ఆ గ్రామ సమీపంలోని అమరావతి – కడప రాష్ట్ర రహదారిపై ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. అయితే గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో కొమరోలు ఎస్సై సుబ్బరాజు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదకరమైన గుంతను దగ్గరుండి మరి స్థానిక గ్రామస్తుల సహాయంతో పూడ్చివేశారు. ఎక్కువగా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రమాదకరమైన గుంతను పూడ్చివేసామని కొమరోలు ఎస్ఐ సుబ్బరాజు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషిచేసిన కొమరోలు ఎస్ఐ సుబ్బరాజును మరియు పోలీసు సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలావరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం