Andhra News: వార్నీ.. మీ నటన ముందు మహానటి కూడా పనికిరాదు..!!

రీల్‌ లైఫ్‌లో వేసిన వేషాలు రియల్‌ లైఫ్‌లో కూడా వేసి హిట్‌ కొట్టేద్దామనుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే నిజ జీవితంలో కూడా నటించి బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ చేద్దామని పక్కా స్కెచ్‌ వేశారు. సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల అవతారం ఎత్తి కోట్లు డిమాండ్‌ చేశారు. చివరకు అసలు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. 9 మంది నకిలీ పోలీసుల ముఠాలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. వీరంతా హైదరాబాద్‌లో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా నటిస్తూ సైడ్‌ బిజినెస్‌గా నకిలీ పోలీసుల అవతారమెత్తి బెదిరింపులకు దిగి ఒంగోలు పోలీసుల చేతికి చిక్కారు.

Andhra News: వార్నీ.. మీ నటన ముందు మహానటి కూడా పనికిరాదు..!!
Fake Police
Follow us
Fairoz Baig

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 31, 2024 | 7:50 PM

ఒంగోలులో శ్యామ్‌ అనే యువకుడు బ్యూటీపార్లర్‌ కోసం ఓ వ్యక్తి నుంచి 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. పదినెలలు దాటినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు శ్యామ్‌ను నిలదీశాడు. అయితే అప్పు తిరిగి చెల్లించేందుకు ఇష్టపడని శ్యామ్‌ హైదరాబాద్‌లో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న వందన అనే మహిళను సంప్రదించాడు. ఒంగోలులో ఓ వ్యక్తి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని, అతడిని పోలీసుల పేరుతో బెదిరిస్తే కోట్లు వస్తాయని నమ్మబలికాడు. దీంతో డబ్బుల కోసం ఆశపడిన సినిమా ఆర్టిస్టు వందన తన తోటి సినీ అర్టిస్టులు మరో ఏడుగురితో కలిసి ఒంగోలుకు వచ్చింది. వచ్చే సమయంలో హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో పోలీసు యూనిఫాంలను అద్దెకు తెచ్చింది. ఒకరికి సీఐ, మరొకరికి ఎస్‌ఐ, మరో ఐదుగురికి కానిస్టేబుళ్ళ డ్రస్సులు వేసింది. ఇక పక్కాగా ప్లాన్‌ అమలు చేసేందుకు సిద్దమయ్యారు.

శ్యామ్‌ తాను అప్పు చేసిన వ్యక్తిని డబ్బులు ఇస్తానని నమ్మించి అప్పటికే అద్దెకు తీసుకున్న ఓ ఇంటికి పిలిపించాడు. అతడ్ని ఒక రూంలో ఉంచి డబ్బులు తెస్తానని చెప్పాడు. అప్పటికే ఆ రూంలో ఓ మహిళను ఉంచాడు. ఇంతలో బిలబిలమంటూ పోలీసులు రూంలోకి ప్రవేశించారు. ” ఏం జరుగుతోంది ” డ్రగ్స్‌ తీసుకుని వ్యభిచారం చేస్తున్నారా… అంటూ గదమాయించి బాధితుడిని బెదిరించారు. బలవంతంగా అతడి బట్టలు విప్పి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశారు. యువతిని రేప్‌ చేశావంటూ భయభ్రాంతులకు గురిచేశారు. నీపై డ్రగ్స్‌ కేసు, రేప్‌ కేసు పెడతామని పోలీసు యూనిఫాంలు వేసుకున్న సినీ ఆర్టిస్టులు అతడ్ని చితకబాదారు. వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని లాక్కున్నారు. నీపై కేసులు లేకుండా చేయాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చివరకు రూ.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు తీసుకువచ్చేందుకు అతడ్ని బయటకు పంపించారు. తీవ్రంగా భయపడిపోయిన ఆ వ్యక్తి వెంటనే ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీసులుగా నటించిన సినీ ఆర్టిస్టులు ఆరుగురితో పాటు శ్యామ్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి బంగారు ఉంగరం, కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో సినిమాల్లో నటించే క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా గుర్తించామని, నిందితులు మొత్తం 9 మందిలో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌..
డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌..
గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..
రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..
రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..
12 రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ !! మళ్లీ వైరల్‌ అవుతున్న దృశ్యాలు
12 రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ !! మళ్లీ వైరల్‌ అవుతున్న దృశ్యాలు
మహిళలకు దివ్యఔషధం ఇది.. బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగితే..
మహిళలకు దివ్యఔషధం ఇది.. బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగితే..
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.