అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి చంపేస్తోంది. సింగిల్ డిజిట్స్ కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలు చింతపల్లిలో నమోదయింది. ఎముకలు కొరికే చలితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు జనం. మన్యాన్ని పొగ మంచు కమ్మేసింది. ఉదయం పది అయితే గాని మంచు తెరలు వినడం లేదు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు తీవ్రత మరింత పెరిగే అవకాశం. పాడేరు, అరకు, చింతపల్లి ఏజెన్సీలో చలితీవ్రత పెరిగింది. గత మూడు రోజులుగా శీతల గాలులు గజగజ వణికిస్తున్నాయి. చలితో గిరిజనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలి మంటలు వేసుకుంటు ఉపశమనం పొందుతున్నారు స్థానిక గిరిజనం.
మరోవైపు సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలవుతూన్న చలి… రాత్రి పూట భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టంగా పొగ మంచు అలముకుంటుంది. ఉదయం పది అయినా మంచు తెరలు వీడడం లేదు. పొగమంచుతో దట్టంగా కురుస్తున్నడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. పగటిపూట కూడా హెడ్ లైట్లు వేసుకుని వాహనదారుల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి.
ఇది చదవండి: గూగుల్ తల్లికే తెలియని అడ్రస్.. ఏపీలో ఓ పాకిస్తాన్ ఉందని తెల్సా.!
అల్లూరు జిల్లా ఏజెన్సీ లో చలితివ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లి లో సింగల్ డిజిట్స్ కు పడిపోయింది ఉష్ణోగ్రత. ఈరోజు 7 ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది ఈ సీజన్లో ఇదే అత్యల్పం. మినుములూరు లో 8, అరకులో 9, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఈరోజు నమోదయింది. మిగతా చోట్ల కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన చలికి గడ్డకడుతుంది మంచు. ఆరుబయట పార్క్ చేసిన వాహనాలపై అక్కడక్కడా దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో మంచు పేరుకుపోయింది. డిసెంబర్ జనవరిలో ఉండాల్సిన చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు నెల ముందే నమోదవుతున్నాయని అంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ చింతపల్లి అప్పలస్వామి.
అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో చలి ఈ సంవత్సరము ముందుగానే మొదలయింది. డిసెంబరు జనవరి నెలలో ఉండాల్సిన చలి తీవ్రత.. నవంబర్ నెల నుంచి మొదలైంది. ఇప్పుడు చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో 2023 నవంబర్ 12 వ తారీఖున 13.0 డిగ్రీలు గా నమోదయింది. ఈ సంవత్సరం నవంబర్ 19 తేదీన 11.3 డిగ్రీలు గా నమోదవడం విశేషం. అదేవిధంగా 2024 జనవరి 7వ తేదీని 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 2023 జనవరి 8వ తారీఖున 1.5 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈరోజు చింతపల్లిలో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. చింతపల్లి పరిశోధన స్థానం ప్రకారం గత రెండు రోజులుగా చింతపల్లి, అరకు, డుంబ్రిగూడ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలో పడిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ నెలలో ఉండవలసిన వాతావరణ పరిస్థితి ఒక నెల ముందు నుంచే ప్రారంభమైంది ఇంకా కొనసాగుతూ ఉంది. మునుముందు ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మూడు రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతున్నాయి. చలి గజగజ వణికిస్తున్నది. ఉదయం 9 గంటలు దాటినా చలి పోవడంలేదు. చిన్నారులు, వృద్ధులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంకాలం సమయంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. ఘాట్ రోడ్ ప్రధాన రహదారుల్లో వాహన డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వాహనాలకు హెడ్ లైట్లు వెలిగించుకొని ప్రయాణాలు చేయక తప్పడం లేదు .
పొగ మంచు ప్రభావం విమానాల రాకపోకలపై తీవ్రంగా పడుతోంది. విశాఖ ఎయిర్పోర్టులో దట్టంగా పొగ మంచు అలుముకుంది. 10 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. దీంతో సోమవారం కూడా ఉదయం హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి రావాల్సిన మూడు విమానాలు ఆలస్యం అయ్యాయి. హైదరాబాద్ విశాఖ హైదరాబాద్ ఇండిగో, చెన్నై విశాఖ చెన్నై ఇండిగో విమానాలు ఆలస్యమయ్యాయి. బెంగళూరు విశాఖ బెంగుళూరు ఎయిర్ ఇండియా విమానం విశాఖలో పొగ మంచు కారణంగా షెడ్యూల్ టైం కి బెంగళూరు నుంచి బయలుదేరలేదు. గత వారం రోజులుగా విశాఖ విమానాశ్రయంలో పొగ మంచుతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు పెరుగుతున్న చలి తీవ్రత పొగ మంచుతో ఏజెన్సీకి సందర్శకుల తాకిడి పెరిగింది. అరకు పాడేరు లోనే పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఎముకల కొరకే చలిలోనూ పర్యాటకులు ప్రకృతి ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఉదయం, రాత్రి చలి తీవ్రతను తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున ఉన్ని దుస్తులు ధరించాలని, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..