YSR Sunna Vaddi Scheme: ఒంగోలు పర్యటనలో( Ongole Tour )సీఎం జగన్బి (CM Jagan) జీబిజీగా ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలలో భాగంగా నేడు పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద జగన్ సర్కార్ వడ్డీ సొమ్మును వారి ఖాతాల్లో నగదును జమ చేసింది. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ సున్నా వడ్డీ రుణాల పధకాన్ని మూడేళ్ళుగా అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో విడత చెల్లించాల్సిన 1261 కోటి రూపాయలు నేరుగా మహిళల ఎకౌంట్లలోకి వేస్తున్నామని అన్నారు. మొదటి ఏడాది 2020 ఏప్రిల్ లో సున్నా వడ్డీ కింద రూ.1258 కోట్లు చెల్లించామని.. రెండో ఏడాది 2021 ఏప్రిల్‌లో సున్నా వడ్డీ కింద రూ.1096 కోట్లు చెల్లించామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ సొమ్ము జమ చేయడం వలన సుమారు 1కోటి, 2 లక్షల 16 వేల 410 మంది మహిళలకు నేరుగా మేలు జరుగుతుందని చెప్పారు.
గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మల మంచిని కోరలేదని.. అందుకనే సున్నా వడ్డీ పథకాన్ని చేసిందని అన్నారు. 2016 నుంచి చంద్రబాబు ప్రభుత్వం సున్నావడ్గీ పధకం రద్దు చేశారని.. దీంతో ఆ ఏడాది మహిళలకు 3036 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ విలువ 2019 నాటికి 25517 కోట్లకు నష్టం చేరింది. అంతేకాదు మహిళలు సుమారు 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. దీంతో 18.36 శాతం డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం.. దీంతో నేడు నిర్వీర్యం అయిన డ్వాక్రా సంఘాలను 0.73శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. వైసీపీ ప్రభుతం అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలు డ్వాక్రా సంఘాలు ఉంటే నేడు 1.02 కోట్లకు చేరాయని .. ఇది చరిత్రలో గొప్పగా నిలిచిపోయే గొప్ప విజయమని సీఎం జగన్ అభివర్ణించారు.
ఇక పేదలకు సంక్షేమ పధకాలు అమలు చేయడానికి వీల్లేదట.. రోజూ పేపర్లు, టివిల్లో డిబేట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు.. టిడిపి ఏం చెప్పాలనుకుంటుందో.. దానిని వారి పత్రికలు, టివిల ద్వారా చెప్పిస్తున్నారు. అసలు ఈ వాదన అర్ధం ఏమిటంటూ ప్రశ్నించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ పేదలకు అందుతున్న పధకాలను అన్నీ ఆపేయాలని ఆ ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా, ఒక ఎల్లో దత్తపుత్రుడు కోరుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇలా సంక్షేమ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. పేదలకు పధకాలు అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందా.. అని ప్రశ్నించారు. ఈ పధకాలు ఆపేస్తే, ఆ డబ్బులు వీరి ఖాతాల్లోకి వెళితే రాష్ట్రం అమెరికా అవుతుందట… ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తున్నామని అన్నారు సీఎం జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: తక్కువ బడ్జెట్‌తో పర్యటించే దేశంలోని హిల్స్ స్టేషన్స్..
Johnson-Modi Meet: అపురూపమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్