YS Jagan: విశాఖలో సీఎం జగన్ బస్సు యాత్ర.. జనసంద్రంగా మారిన తీర ప్రాంతం.. వీడియో

విశాఖ జనసంద్రంగా మారింది. నగరంలో అడుగుపెట్టిన సీఎం జగన్‌ బస్సుయాత్రకు జనం అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు ఏపీ సీఎం.. పినకాడి జంక్షన్ చేరుకున్న సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు.

YS Jagan: విశాఖలో సీఎం జగన్ బస్సు యాత్ర.. జనసంద్రంగా మారిన తీర ప్రాంతం.. వీడియో
Ys Jagan

Updated on: Apr 21, 2024 | 8:55 PM

విశాఖపట్నంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. శనివారం రాత్రి బస చేసిన చిన్నయపాలెం ప్రాంతం నుంచి సీఎం జగన్ యాత్ర మొదలైంది. పెందుర్తి నియోజకవర్గం లక్ష్మీపురం జంక్షన్‌కు చేరుకున్న యాత్రకు వైసీపీ శ్రేణులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. వారికి సీఎం జగన్ అభివాదం చేశారు.

పినకాడి జంక్షన్ చేరుకున్న సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు. సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. పలు చోట్ల బస్సు దిగి ప్రజలతో మాట్లాడారు సీఎం జగన్..

వేపగుంట చేరుకున్న సీఎం జగన్‌కు జనం నీరాజనం పలికారు. అక్కడి నుంచి గోపాలపట్నం చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్రకు విశేష స్పందన లభించింది. ప్రజలతో మేమకమవుతూ సీఎం జగన్ యాత్రను కొనసాగించారు.

వీడియో చూడండి..

ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌పై సీఎం జగన్‌ కాన్వాయ్‌కు రెండు వైపులా జనసందోహం తరలివచ్చింది. నగరంలోని కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాకలో సీఎం జగన్ యాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. బస్సుపై నుంచి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం జగన్.. ఎంవీవీ సిటీ ఎండాడ దగ్గర ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..