CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బుధవారం తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన నాలుగో విడత డబ్బులు
0.85 లక్షల మంది విద్యార్థులకు గానూ మొత్తం రూ.709 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనారిటీ, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమకానున్నాయి.
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం (నవంబర్30) జమచేయనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నిధులు విడుదల కానున్నాయి. 10.85 లక్షల మంది విద్యార్థులకు గానూ మొత్తం రూ.709 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనారిటీ, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమకానున్నాయి. దీని కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం కోసం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్.
వాయిదా పడినా..
కాగా నిజానికి ఈ నెల 25వ తేదీ నాడే వైఎస్ జగన్ బహిరంగ సభ షెడ్యూల్ అయింది గానీ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది. 24, 25 తేదీల్లో వాయుగుండం ప్రభావం ఉండటం వల్ల ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు మదనపల్లె పర్యటనను 30వ తేదీకి వాయిదా వేశారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పథకంలో భాగంగా పేద విద్యా్ర్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్థులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే నాలుగో విడత నిధులు విడుదల చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..