CM Jagan: భూ సర్వే చురుగ్గా ముంద‌కు సాగాలి.. అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు

|

Jun 02, 2021 | 2:47 PM

జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్​ సమీక్ష నిర్వహించారు. భూరక్ష పథకం చురుగ్గా ముందుకు..

CM Jagan: భూ సర్వే చురుగ్గా ముంద‌కు సాగాలి.. అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు
Cm Jagan
Follow us on

జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్​ సమీక్ష నిర్వహించారు. భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌నులు మందగమనంలో ఉన్నాయ‌ని.. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా రివ్యూలు చేయాలని.. అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. సర్వేకు ఇబ్బంది రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. మారుమూల ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల‌ని.. సిగ్నల్స్‌ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రెడీ చేసుకోవాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. అన్ని సేవలందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారుకావాలన్నారు. అన్నిరకాల ట్రైనింగ్‌ల‌కు సంబంధించి ఈ – ఫార్మాట్‌లో ఉంచాలన్నారు. ఒక డిజిటల్‌ లైబ్రరీని అందుబాటులో ఉంచాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుతం అందిస్తోన్న జనన, మరణ ధృవీకరణపత్రాల్లోనే అన్నిరకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్​తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

పొద‌ల్లోని కుందేలుపై డేగ స‌డ‌న్ అటాక్… ఆ త‌ర్వాత ఏమైందో మీరే చూడండి