Andhra Pradesh: వారికి వెంటనే తక్షణం సాయం 1000 రూపాయలు అందించండి.. సీఎం జగన్ ఆదేశాలు

ఏపీలోని ఎనిమిది జిల్లాలపైనా వాయుగుండం ప్రభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో 8 జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్‌.

Andhra Pradesh: వారికి వెంటనే తక్షణం సాయం 1000 రూపాయలు అందించండి.. సీఎం జగన్ ఆదేశాలు
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2021 | 6:56 PM

ఏపీలోని ఎనిమిది జిల్లాలపైనా వాయుగుండం ప్రభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో 8 జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్‌. వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేరట్టాలని.. పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు సీఎం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలను వెంటనే ప్రారంభించాలన్నారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉండేవాళ్లను బాగా చూసుకోవాలని.. వారికి మంచి ఫుడ్, వాటర్ అందజేయాలన్నారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద 1000 రూపాయలు అందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి  ఎటువంటి సాయం కావాలన్నా.. ప్రభుత్వం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఏపీలోని మొత్తం 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు..కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి. జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోంది. కోస్తా, రాయలసీమలోనూ మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలోనూ భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షాలకు వరిచేలు నేలకొరిగింది. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, అల్లవరం, అమలాపురం మండలాల్లో వర్షాలు పడ్డంతో.. పంటలు నీటమునిగాయి. దీంతో అన్నదాతలు విలవిలలాడారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. అర్థరాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎటు చూసినా రోడ్లు జలమయమై కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో.. సహాయక చర్యలకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందుకు 1913 నెంబర్ కేటాయించారు.

నెల్లూరు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. కలెక్టర్ ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు..తిరుమలను మబ్బులు కమ్మేశాయి. కొండపై నిన్న ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. అసలే చలి. ఆపై వర్షంతో శ్రీనివాసుడి భక్తులు గజగజ వణికిపోతున్నారు. వర్షాలకు ఘాట్‌ రోడ్డు పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. దీంతో తిరుపతి నుంచి తిరుమల రావడానికి, కిందకు వెళ్లడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

కొండపై శ్రీవారి ఆలయ మాడ వీధులు, మిగిలిన అన్ని రోడ్లు వర్షం నీళ్లతో నిండిపోయాయి. భక్తులు దర్శనానికి వెళ్ళడానికి, గదులకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపై ఉన్న శ్రీవారి పాదాలు, పాపవినాశనం వెళ్ళే రూట్లలో చెట్లు కూలిపోయాయి. ముందు జాగ్రత్తగా ఆ మార్గాలను మూసివేసింది టీటీడీ. నడకదారిలోని గాలి గోపురం దగ్గర వున్న దుకాణాలు, రేకుల షెడ్లపై చెట్లు కూలాయి.

Also Read: పైకి అందమైన ఫోటో ప్రేమ్స్.. లోపల చీకటి బాగోతం.. పోలీసులు స్టన్

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడ ఉందో కనిపెడితే మీరు గ్రేటే.. ఒక్కసారి ట్రై చేయండి