AP CM Jagan: నిరుద్యోగ సమస్యను తీర్చేదిశగా సీఎం జగన్ అడుగులు.. ఉన్నత విద్యావిధానంపై దృష్టి

|

Jan 19, 2023 | 9:52 PM

విద్య అనేది స్టూడెంట్స్ కు ఉద్యోగం లేదా స్వయం ఉపాధినిచ్చే విధంగా ఉండాలని తెలిపారు. ఇందుకోసం విదేశాల్లోని ఫేమస్ కాలేజీల కరిక్యులమ్‌ లను అధ్యయనం చేయాలనీ.. వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలని కోరారు. అంతేకాదు స్టూడెంట్స్ కు స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్‌ చేసుకోవాలని తెలిపారు

AP CM Jagan: నిరుద్యోగ సమస్యను తీర్చేదిశగా సీఎం జగన్ అడుగులు.. ఉన్నత విద్యావిధానంపై దృష్టి
Andhra Pradesh Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత విద్య విధానంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. డిగ్రీ చదువుతున్నస్టూడెంట్స్  నైపుణ్యం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని జగన్‌ మోహన్ రెడ్డి సూచించారు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న కోర్సులను పరిశీలించాలని.. అందుకు అనుగుణంగా  ఏపీలోకి స్టూడెంట్స్ కు విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. విద్య అనేది స్టూడెంట్స్ కు ఉద్యోగం లేదా స్వయం ఉపాధినిచ్చే విధంగా ఉండాలని తెలిపారు.

ఇందుకోసం విదేశాల్లోని ఫేమస్ కాలేజీల కరిక్యులమ్‌ లను అధ్యయనం చేయాలనీ.. వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలని కోరారు. అంతేకాదు స్టూడెంట్స్ కు స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్‌ చేసుకోవాలని తెలిపారు. రిస్క్‌ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి కోర్సులను అభ్యసిస్తే.. స్టూడెంట్స్  డిగ్రీ కంప్లీట్ చేసే సరికి స్వయం ఉపాధి అందుతుంది. కనుక ఈ కోర్సులను వచ్చే  విద్య సంవత్సరం జూన్‌ కల్లా పాఠ్య పుస్తకాల్లో పాఠ్యంశాలుగా ఉండాలని తెలిపారు.

ఇప్పటికే ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాం.. ఈ నేపధ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని స్పష్టం చేశారు జగన్.

ఇవి కూడా చదవండి

కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్‌ పాలసీ ఉండాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు.  హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుంది. ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి జగన్. కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో  వసతులు అరకొరగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నాయని   ఆయా కాలేజీలపై విద్యార్థుల హాజరును, వసతులను ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీల నిర్వహణపై ఒక నిర్ణయానికి రావాలన్న సీఎం జగన్ సూచించారు.

టీచింగ్ స్టాఫ్  సామర్థ్యాన్ని మెరుగు పరిచే విహంగా తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీని బలోపేతం చేయాలనీ.. అంతేకాదు ట్రల్‌ ఆంధ్రా పరిధిలో అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం స్టూడేంట్స్ కు  సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానెల్స్‌ రిపేరు వంటి వాటిలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు సీఎం జగన్.  ఈ మేరకు కోర్సులు  వచ్చే జూన్‌  ఏర్పాటు చేయాలని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..