CM Jagan Humanity: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్.. సహాయార్ధం వచ్చిన వ్యక్తికి నేనున్నానంటూ భరోసా..
రాజంపేట కొలిమి వీధికి చెందిన అనంతగిరి అనే వ్యక్తి నరాల బలహీనతతో భాదపడుతున్నాడని తెలుసుకున్నారు జగన్. ఈ సమస్య వెంటనే పరిష్కారించాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

మరోసారి మానవతను చాటుకున్నాడు ఏపీ సీఎం జగన్. కడప, పులివెందులలో అహోబిలం స్కూలు ప్రారంభకార్యక్రమాన్ని ముగించుకుని వెళుతున్న సీఎం జగన్… తన సహాయార్దం వచ్చిన వ్యక్తిని చూసి స్వయంగా కారు దిగి వచ్చి తన సమస్యను తెలుసుకొన్నారు. రాజంపేట కొలిమి వీధికి చెందిన అనంతగిరి అనే వ్యక్తి నరాల బలహీనతతో భాదపడుతున్నాడని తెలుసుకున్నారు జగన్. ఈ సమస్య వెంటనే పరిష్కారించాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అంతే కాకుండ మీకు ఎలాంటి సహయం కావలన్నా తనను స్వయంగా కలువొచ్చని తన విసింటింగా కార్డును ఇచ్చాడు. మనసున్న మారాజు మా జగన్ మా దగ్గరకు వచ్చి సమస్యను తెలుసుకుని మరీ సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది మాజీవితంలో మరిచిపోలేని సంఘటన అని తెలియజేశారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం జగన్ పులివెందులలో 120 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2023 చివరి నాటికి పులివెందులలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ప్రకటించారు. బెంగళూరు, విజయవాడను కలిపే జాతీయ రహదారుల పనులు, రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు. తాను చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు సీఎం జగన్.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పులివెందుల ప్రజలకు ఆర్టీసి బస్టాండ్ నిర్మించి ఇస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసి బస్టాండ్ కట్టలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని విమర్శించడం దారుణమన్నారు. తన నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా మారుస్తానని సీఎం హామీ ఇచ్చారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..