Andhra Pradesh: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ సమీక్ష.. మరణించిన ఏపీ వాసులకు రూ. 10 లక్షల పరిహారం

|

Jun 04, 2023 | 3:07 PM

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన వాళ్లు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందించాలని,...

Andhra Pradesh: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ సమీక్ష.. మరణించిన ఏపీ వాసులకు రూ. 10 లక్షల పరిహారం
Cm Jagan
Follow us on

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన వాళ్లు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన పరిహారానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందించనుంది.

ఇదిలా ఉంటే రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇక బాలాసోర్‌ పరిస్థితులను మంత్రి అమర్నాథ్‌ సీఎం జగన్‌కు వివరించారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను విశాఖ నుంచి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణీకులను 695 మందిని గుర్తించామన్నారు. 553 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.

కోరమండల్‌ రైలులో 480 మంది, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ప్రయాణించారు. 22 మంది గాయపడ్డారు. 92 మంది రైలు ప్రయాణం చేయలేదని చెప్ఉపకొచ్చారు. ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదన్న మంత్రి.. గాయపడిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విశాఖ ఆసుపత్రిలో ఐదుగురికి చికిత్స అందిస్తున్నామని, స్వల్ప గాయాలైన 11 మందికి చికిత్స అందించి పంపించామని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..