AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాష్ట్ర భవితవ్యం మార్చేందుకు.. 74 వయస్సులోనూ వడివడిగా అడుగులు

ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదిక పరిశీలనతో చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది... అక్కడ నుంచి నేరుగా ఉద్దండ రాయినిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి సీఎం చేరుకుంటారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు..

Andhra Pradesh: రాష్ట్ర భవితవ్యం మార్చేందుకు.. 74 వయస్సులోనూ వడివడిగా అడుగులు
Chandrababu Naidu
Follow us
pullarao.mandapaka

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 20, 2024 | 11:19 AM

ఒకవైపు పోలవరం… మరోవైపు అమరావతి.. సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టులు.. అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ రెండింటి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం.. ఇప్పటికే పోలవరం పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించిన సీఎం చంద్రబాబు… గురువారం అమరావతిలో పర్యటిస్తున్నారు.

గడచిన ఐదేళ్లలో అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదు.. టిడిపి హయంలో నిర్మించిన అసంపూర్తి భవనాలు కూడా ఎక్కడివి అక్కడే ఉన్నాయి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో క్లీనింగ్ ప్రక్రియ చేపట్టారు అధికారులు.. గత టిడిపి హయంలో నిర్మించిన భవనాలు, ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న చెత్త, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి క్లీన్ చేశారు… అసలు అమరావతి స్వరూపం ఎలా ఉంది…? ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? పనులు ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు అమరావతిలో పర్యటనలు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..

సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన షెడ్యూల్ ఇదే

ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదిక పరిశీలనతో చంద్రబాబు పర్యటన ప్రారంభం అయింది… అక్కడ నుంచి నేరుగా ఉద్దండ రాయినిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి సీఎం చేరుకుంటారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు… అక్కడి నుంచి సీట్ ఆక్సిస్ రోడ్డు ఆనుకుని దాదాపు 90% నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ భవనాలను చంద్రబాబు పరిశీలిస్తారు.. ఆ తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కార్టర్లు, హైకోర్టు బిల్డింగు, ఎన్జీవో, గ్రూప్ 4 ఉద్యోగుల భవనాల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాయపూడి లోని సి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసులో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అంతకుముందు అక్కడ దించిన సామాగ్రి కూడా చోరీకి గురైంది.. వీటిపై విచారణ జరుపుతామన్నారు మంత్రి… అయితే గత టిడిపి హయాంలో పిలిచిన టెండర్ల కాల పరిమితి ముగియడంతో మళ్లీ తాజాగా టెండర్లు పిలవాలన్నారు మంత్రి.. టెండర్లు పూర్తికావడానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు.. ఈలోగా నిర్మాణాల పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులతో కమిటీ వేస్తామన్నారు.. సీఎం చంద్రబాబు పర్యటన ద్వారా అమరావతిలో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా ముందుకు వెళ్తామంటున్నారు..

అంతకు ముందు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు ముఖ్యమంత్రి.. గడిచిన ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.. గత పాలకుల నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కనీసం నాలుగు సీజన్లు పడుతుందని సీఎం చెప్పారు… పోలవరం నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం చంద్రబాబు… దీనికి సంబంధించి అధికారుల నుంచి పూర్తి నివేదిక కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

రాజస్థాన్‌లోని టోంక్.. ఫ్యామిలీ టూర్‎కి బెస్ట్.. ఏమి చూడాలంటే.?
రాజస్థాన్‌లోని టోంక్.. ఫ్యామిలీ టూర్‎కి బెస్ట్.. ఏమి చూడాలంటే.?
IPL 2025: 14 ఏళ్లకే 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన బుడ్డోడు..
IPL 2025: 14 ఏళ్లకే 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన బుడ్డోడు..
నటరాజన్‌ ను అందుకే ఆడించడం లేదన్న పీటర్సన్..
నటరాజన్‌ ను అందుకే ఆడించడం లేదన్న పీటర్సన్..
ఐదు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు..
ఐదు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు..
శిష్యుడు సెంచరీతో వీల్ చెయిర్ నుంచి లేచిన ద్రవిడ్
శిష్యుడు సెంచరీతో వీల్ చెయిర్ నుంచి లేచిన ద్రవిడ్
జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం
జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం
అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ చూశారా..?
అటు ఎండలు.. ఇటు వానలు.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ చూశారా..?
ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు..
ఆమె మాటలు నన్ను బాధపెట్టాయి.. ఇక పై మా ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు..
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
సొంత వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్
'ఎంత తోప్ బౌలరైనా భయపడేది లే'.. సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్