AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘ప్రజాధనం పార్టీకి పనిచేసినవారికి’.. ఆ శాఖలపై సీఎం నజర్

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది టీడీపీ ప్రభుత్వం. గడిచిన ఐదేళ్లలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంది. ప్రభుత్వ ధనాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించినట్లు తాజాగా గుర్తించింది సర్కార్. దీంతో పూర్తిస్థాయిలో ఆయా శాఖలపై దృష్టి పెట్టింది.

Andhra Pradesh: 'ప్రజాధనం పార్టీకి పనిచేసినవారికి'.. ఆ శాఖలపై సీఎం నజర్
CM Chandrababu Naidu
Follow us
pullarao.mandapaka

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 20, 2024 | 11:35 AM

గడిచిన ఐదేళ్లలో ప్రజాధనం భారీగా వృధా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది… వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వైసీపీ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నట్లు ప్రభుత్వ విచారణలో వెలుగు చూసింది.. వైయస్ఆర్సీపీ కోసం పనిచేసిన కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లక్షలాది రూపాయల జీతం చెల్లించినట్లు బయటపడింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ప్రభుత్వం గుర్తించింది. జీతాల పేరుతో భారీగా ప్రభుత్వ ఖాజానాకు నష్టం చేకూర్చినట్టు ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇచ్చారు అధికారులు.

బాధ్యులపై త్వరలో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం

ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తూ.. పార్టీ కోసం పని చేసిన వారి జాబితాను అధికారులు సిద్దం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేల మందికి లక్షల్లో జీతాలిచ్చి.. వారిని వైసీపీ కోసం పని చేయించుకున్నారని గుర్తించింది సర్కార్. అంతేకాకుండా ఐదేళ్లు పాటు ఆఫీసుకు రాకుండానే చాలా మందికి జీతాలు కూడా చెల్లించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగుల పేరుతో అడ్డగోలు నియామకాలు జరిగాయని తేలింది. దీంతో వారి అటెండెన్స్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల లిస్ట్ కూడా సిద్ధం చేశారు. అర్హత లేకున్నా కొందరికి తప్పుడు రికార్డులతో నియామాకాలు జరిపారని బయటపడింది. నియామక పత్రాలు, అర్హత డాక్యుమెంట్ల పరిశీలనపై దర్యాప్తు చేస్తుంది ప్రభుత్వం.

ఇలా పలు శాఖల్లో కొంతమంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో 400 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని గుర్తించారు. దీనికి సంబంధించిన సమాచారం ఓ కొలిక్కి వచ్చాక కేసు నమోదు చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.   

డబ్బులు డ్రా చేసేందుకు సాయం అడిగిన మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
డబ్బులు డ్రా చేసేందుకు సాయం అడిగిన మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఆరోగ్యం, డబ్బు, శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం
ఆరోగ్యం, డబ్బు, శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం
ఈ పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు..!
ఈ పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 12వేల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 12వేల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన
ఇలా ఈజీగా మీ గ్యాస్ బర్నర్‌ ను కొత్త దానిలా మెరిపించండి..!
ఇలా ఈజీగా మీ గ్యాస్ బర్నర్‌ ను కొత్త దానిలా మెరిపించండి..!
షోయబ్ అక్తర్ ఛానల్‌కు ఇండియా షాక్.. పూర్తిగా బ్లాక్!
షోయబ్ అక్తర్ ఛానల్‌కు ఇండియా షాక్.. పూర్తిగా బ్లాక్!
పుచ్చకాయతో టేస్టీ టేస్టీ డ్రింక్స్ తయారు చేసుకోండి రెసిపీ మీకోసం
పుచ్చకాయతో టేస్టీ టేస్టీ డ్రింక్స్ తయారు చేసుకోండి రెసిపీ మీకోసం
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎయిర్ కూలర్ ను ఏసీలా మార్చేయొచ్చు.. ఈ టెక్నిక్ తెలుసా?
ఎయిర్ కూలర్ ను ఏసీలా మార్చేయొచ్చు.. ఈ టెక్నిక్ తెలుసా?
తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి!
తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి!