AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎలా మోసపోయార్రా బాబూ.. బెట్టింగ్ పేరుతో యాపే క్రియేట్ చేశాడు.. ఆ తర్వాత జరిగిందిదే..

ఏపీలో నకిలీ బెట్టింగ్ యాప్ మోసం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయల్‌పేటలో ఈ బెట్టింగ్‌ యాప్‌ మోసం వెలుగులోకొచ్చింది. మొబైల్‌ షాప్‌ నడుపుతూ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌తో పలువురిని మోసం చేసిన చంద్రబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తానే ఓ బెట్టింగ్‌ యాప్‌ క్రియేట్‌ చేసి సుమారు 5 కోట్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Andhra: ఎలా మోసపోయార్రా బాబూ.. బెట్టింగ్ పేరుతో యాపే క్రియేట్ చేశాడు.. ఆ తర్వాత జరిగిందిదే..
Betting App Case
Raju M P R
| Edited By: |

Updated on: Sep 23, 2025 | 11:42 AM

Share

ఏపీలో నకిలీ బెట్టింగ్ యాప్ మోసం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయల్‌పేటలో ఈ బెట్టింగ్‌ యాప్‌ మోసం వెలుగులోకొచ్చింది. మొబైల్‌ షాప్‌ నడుపుతూ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌తో పలువురిని మోసం చేసిన చంద్రబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తానే ఓ బెట్టింగ్‌ యాప్‌ క్రియేట్‌ చేసి సుమారు 5 కోట్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బు ఆశ చూసి బెట్టింగ్‌ యాప్‌లో అకౌంట్‌ తెరిపించడమే కాకుండా… బెట్టింగ్ పెట్టేలా ప్రోత్సాహించినట్లు వెల్లడించారు. ఈ చంద్రబాబు బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌తో పాటు పోలీసులు కూడా ఉండటం షాక్‌కు గురిచేస్తోంది. ఇక నిందితుడిని మదనపల్లి సబ్‌ జైలుకు పంపిన అధికారులు… లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాయల్ పేటలో క్రికెట్ బెట్టింగ్ యాప్ తో నిందితుడు.. రూ.కోట్లు కొట్టేసినట్లు స్థానికులు తెలిపారు.

పూర్తి వివరాలివే..

రాయల్ పేట కేబుల్ ఆపరేటర్ లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. మొబైల్ షాప్ పేరుతో వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అనే యువకుడు.. క్రికెట్ బెట్టింగ్ యాప్ వ్యవహారం నడిపించాడు.. రాదే ఎక్స్చేంజ్ పేరుతో క్రికెట్ బెట్టింగ్ యాప్ సృష్టించి పలువురి నుంచి డబ్బులు దండుకున్నాడు.. క్షణాల్లో. రూ కోట్ల సంపాదన అంటూ నమ్మించి క్రికెట్ బెట్టింగ్ బరిలోకి దించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఆశ చూపి బ్యాంకు ఖాతాలు తెరిపించి మోసాలకు పార్పడ్డాడని.. వారి బ్యాంకు ఖాతాలకు తన మొబైల్ నెంబర్ అనుసంధానం చేసి.. ఖాతాదారునికి తెలియకుండా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

డిష్ ఆపరేటర్ లక్ష్మీనారాయణ తన ఖాతాలో జరిగిన రూ.కోటి మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించి.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ బెట్టింగ్ కేసులలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు.. బాధితుల్లో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, క్రీడాభిమానులు ఉన్నారని.. ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై పోకిరీల దాడి.. వీడియో వైరల్
విహారయాత్రకు వచ్చిన ఫ్యామిలీపై పోకిరీల దాడి.. వీడియో వైరల్
ఇంట్లో గ్యాస్ లీక్ అయితే.. వెంటనే ఇలా చేయండి..
ఇంట్లో గ్యాస్ లీక్ అయితే.. వెంటనే ఇలా చేయండి..
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..
12 బంతుల్లో మ్యాజిక్.. కట్‌చేస్తే.. 13 ఏళ్ల రికార్డ్ స్మాష్..
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి
రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. వెంటనే మానేయండి
బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్
బద్దలైన సచిన్ స్పెషల్ హిస్టరీ.. కోహ్లీ ఖాతాలో ప్రపంచ రికార్డ్
రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!
రూపాయి నష్టం లేకుండా.. డ్యామేజ్ నోట్లను ఇలా మార్చుకోండి!
10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?
10 కేజీల సిలిండర్లపై కేంద్రం బిగ్ న్యూస్.. ఎప్పుడు వస్తాయంటే..?
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు
మనీ ప్లాంట్ వాస్తు రహస్యమిదే.. ఈ దిక్కులో ఉంటే డబ్బే డబ్బు