Road Accident in Chittoor District: తిరుమల దైవదర్శనానికి వెళ్తుండగా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా ఐతేపల్లి- అగరాల మధ్య జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన మెరైన్ ఇంజనీర్ కంచారపు సురేష్‌కుమార్‌కు ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆమోకు తిరుపతిలో తలనీలాల మొక్కు చెల్లించేందుకు ఒకే కుటుంబానికి చెందిన 13 మంది బయలుదేరారు. కానీ మార్గ మధ్యలోనే వారిని విధి వెంటాడింది. డివైడర్ రూపంలో మృత్యువు కబళించింది.
ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మేడమర్తిలో విషాదం అలుముకుంది. కొడుకులు, అల్లుడు, కోడళ్లు, కూతుర్లు, మనవలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల.. ఆక్రందనలు ఆకాశాన్నంటాయి. మృతుల కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోయాయి. ఒకేసారి ఏడు మంది చనిపోవడంతో గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీలైనంత త్వరగా మృతదేహాలను తీసుకురావాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.
Also Read..
Hyderabad: బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదం.. కారు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం