Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా

చింత చిగురు ధర ఏంటి ఇంతలా పెరిగింది.? ఒకప్పుడు రూ. 20 నుంచి రూ. 30 పలికే చింత చిగురు.. ఇప్పుడు ఏకంగా వందలు పలుకుతోంది. ఇలా తీసుకొచ్చిన కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

AP News: అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా
Chinta Chiguru
P Kranthi Prasanna
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 03, 2025 | 12:28 PM

Share

మే, జూన్ నెలలలోనే దొరికే చింత చిగురు.. జూలైలోనూ అందుబాటులో ఉండటంతో చింత చిగురుకు డిమాండ్ పెరిగింది. పుల్ల.. పుల్లగా.. ఉండే చింతాకు ఎవరు తినాలనుకోరు. నోటికి కమ్మగా, హెల్దీగా ఉండే చింతాకు సీజనల్‌గానే దొరకడంతో దానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడైతే కేజీ రూ. 500 నుంచి రూ. 700 పలుకుతున్నా.. చింత చిగురును కొనేందుకు కూడా కొనుగోలుదారులు వెనకాడటం లేదు. విటమిన్లు ఎక్కువగా వుంటాయని, ఎరువుల మందులు వాడని చింతాకు తినేందుకు ఇష్టపడుతున్నారు పబ్లిక్. ముఖ్యంగా మటన్, చికెన్, ఫిష్ అన్ని నాన్ వెజ్ వంటల్లో చింతాకు వేస్తే ఆ టేస్ట్ వేరబ్బా అంటూ తింటున్నారు చింత చిగురు ప్రియులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోనే ఐదు గంటల్లో యాభై నుంచి అరవై కేజీల చింత చిగురు అమ్ముడుపోతుంది. మారుతున్న కాలంతో పాటు చింతాకు రేటు మారిందంటున్నా.. కొనేవాళ్ల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందంటున్నారు.

చింత చిగురు ప్రయోజనాలు..

చింత చిగురులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నోటి పూత, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చింత చిగురులో ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చింత చిగురులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..