Andhra Pradesh: జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..5వ తేదీన ఉదయం ప్రధాని మోదీతో భేటీ..

జూలై 5వ తేదీన ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లుగా సమాచారం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన తర్వాత వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

Andhra Pradesh: జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..5వ తేదీన ఉదయం ప్రధాని మోదీతో భేటీ..
CM Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 01, 2023 | 9:54 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 4వ తేదీన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేస్తారు. జూలై 5వ తేదీన ఉదయం ప్రధాని మోదీని కలవనున్నారు. పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లుగా సమాచారం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన తర్వాత వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితితులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం పలు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ కలవనున్నారు. వివిధ శాఖల మంత్రులతో కలిసి రాష్ట్రంలోపెండింగ్‌ నిధుల విడుదలపై చర్చిస్తారు.

ఇదిలావుంటే, జూలై 4న అంటే మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నట్లుగా సమాచారం. మంగళవారం ఉదయం 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరులో అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే కొత్త యూనిట్‌కు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు.

ఆ తర్వాత పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 300 పడకల ఆస్పత్రికి సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం