
భూములపై నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు చేపడుతున్న భూముల రీ సర్వేపై సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులతో ఇవాళ (మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు ద్వారా రీ సర్వే చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రివ్యూ చేపట్టనున్నారు. భూ సర్వే వివాదాలపై గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారు. అంతే కాకుండా గ్రామ సచివాలయాల్లోనూ సబ్ రిజిస్ట్రార్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ విధానం ద్వారా రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయని, పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. గ్రామస్థాయిలో సేవలు అందుబాటులోకి రావడంతో క్షేత్రస్థాయి సమస్యలను త్వరగా పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదే. 2023 ఆగస్టు నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అన్ని మండలాల్లో ఒకేసారి సమగ్ర భూసర్వే ప్రారంభించాలి. సర్వే చేస్తున్న సమయంలో వచ్చే వివాదాలను వెంటనే పరిష్కరించాలి. గ్రామ సచివాలయాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ సేవలు అందించాలి. సర్వే ప్రారంభం అయ్యే నాటికే అవసరమైన పరికరాలు, డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్లు, మొబైల్ ట్రైబ్యునల్స్, సర్వే బృందాలకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా వాటి వినియోగంపై సర్వేయర్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలి. 1930 తర్వాత జరుగుతున్న సమగ్ర భూ సర్వేపై గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలి. సమాచారం అందించడంతో పాటు, భూ యజమానులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలి.
– సీఎం జగన్… గతంలో ఇచ్చిన ఆదేశాలు..
మరిన్ని ఏపీ వార్తల కోసం..