Jagananna Smart Townships: మధ్య తరగతి సొంతింటి కలకు సీఎం జగన్ శ్రీకారం.. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Jan 11, 2022 | 3:27 PM

ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోకీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు..

Jagananna Smart Townships: మధ్య తరగతి సొంతింటి కలకు సీఎం జగన్ శ్రీకారం..  జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Follow us on

ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోకీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ వెబ్‌సైట్‌ను క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ తనకంటూ ఒక సొంత ఇళ్లు ఉండాలన్నారు సీఎం జగన్. ఏ పేదవాడికి కూడా సొంతఇళ్లు లేని పరిస్థితి ఉండకూడదు అనే మంచి సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇప్పటికే పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయన్నారు. సరసమైన ధరలకే మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు ఉండాలనే కలను సాకారం చేసేందుకే ఈ ప‌ధ‌కం అని వెల్లడించారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని.. వివాదాలకు తావేలేని క్లియర్‌ టైటిల్స్‌తో పాటు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాటును అందించే ప్రయత్నమే ఈ జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం అని అన్నారు.

ఈ రోజు నుంచి సంక్రాంతి పండగ వేళలో దీనికి శ్రీకారం చుడుతున్నాట్లుగా తెలిపారు. మూడు కేటగిరీలలో స్ధలాలు కేటాయింపు.. ఎంఐజీ –1 కింద 150 గజాలు, ఎంఐజీ –2 కింద 200 గజాలు, ఎంఐజీ –3 కింద 240 గజాలు ప్రతి లేఅవుట్‌లో ఏర్పాటు చేశామన్నారు.

మొదటి దశలో అనంతపురంజిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైయస్సార్‌ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ లేఅవుట్‌లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాట్లుగా వెల్లడించారు. ఈ 6 జిల్లాలే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుందన్నారు. కాబట్టి ప్రతినియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుందని వెల్లడించారు.

ప్రతి లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. ఎక్కడా కూడా కులం, మతం, ప్రాంతంతో పాటు ఏ రాజకీయ పార్టీ అని కూడా చూడం. ఈ కాలనీల నిర్వహణ కోసం కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం అభివృద్ది చేస్తున్న కాలనీలు భవిష్యత్తులో పాడుబడిపోకూడదు.

వీటి నిర్వహణకోసం కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి, ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్‌కు ఆ కార్పస్‌ ఫండ్‌ అప్పగిస్తాం. పట్టణాభివృద్ధిసంస్ధలతో కలిసి వాటిని సంయుక్తంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. వీటన్నంటితో మంచి లేఅవుట్‌ రావాలని, మధ్యతరగతికుటుంబాలకు దీనివల్ల మంచి జరగాలని కోరుకుంటున్నట్లుగా సీఎం జగన్ తెలిపారు.

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తాం.

మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్ధలాలు (ప్లాట్లు) కేటాయించి వారి సొంతింటి కలను సాకారం చేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ)వారికి అనువైన ధరల్లో లిటిగేషన్లకు తావులేని స్ధలాలు కేటాయిస్తున్న ప్రభుత్వం.  రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ సర్కార్ పేర్కొంది.

నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తారు. నేటి నుంచి వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

అగ్రిమెంటు చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్‌ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు అప్పటికి ఇంకా మిగిలిపోయిన 30 శాతం అమౌంట్‌ చెల్లిస్తే.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి వాళ్లకు ప్లాటు అప్పగిస్తారు. ఇలా వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం అమౌంట్‌ ఇచ్చే వాళ్లకు 5 శాతం రాయితీ కూడా ఇస్తారు.

ఇవి కూడా చదవండి: Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..

Ration Card: మీకు తెలుసా ఈ విషయం.. రేషన్ కార్డులో మీ పేరు ఉందో.. లేదో.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు..