Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ ప్రయాణం కోసం ఎదురుచూసే ప్రయణికులకు ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

Vande Bharat: గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో
Vande Bharat Train

Updated on: Dec 15, 2025 | 9:47 AM

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సోమవారం (డిసెంబర్ 15) నుంచి వందే భారత్ రైలు పరుగులు తీయనుంది.. తమిళనాడు చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ ప్రయాణం కోసం ఎదురుచూసే ప్రయణికులకు ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.. నర్సాపూర్‌ – చెన్నయ్‌ మధ్య 655 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 9 గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని అధికారులు తెలిపారు.. ఇవాళ చెన్నై సెంట్రల్‌ – నర్సా పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను లాంఛనంగా ప్రారంభించనుండగా.. డిసెంబర్ 17వ తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

నరసాపూర్-చెన్నై మార్గంలో పరుగులు తీయనున్న ఈ మొదటి వందే భారత్ తో నరసాపూర్-చెన్నై సెక్టార్‌లో వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి.. 655 కి.మీ దూరాన్ని 8 గంటల 55 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ప్రయాణ సమయంలో ఈ వెసులుబాటుతో రోజువారీ ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.. ఈ నరసాపూర్-చెన్నై వందేభారత్ రైలు రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్ – భీమవరం టౌన్ వద్ద ఆగుతుంది.

రైలు షెడ్యూల్..

షెడ్యూల్ ప్రకారం, చెన్నైకి వెళ్లే సర్వీస్ మధ్యాహ్నం 2:50 గంటలకు నరసాపూర్ నుండి బయలుదేరి రాత్రి 11:45 గంటలకు డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. చెన్నై నుండి బయలుదేరే రైలు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది.

టికెట్ ధర..

టిక్కెట్ ధరలు AC చైర్ కార్ కు రూ.1,635 మరియు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కు రూ.3,030 నిర్ణయించారు. ప్రయాణీకులకు వేగవంతమైన ప్రయాణాలు, ఆధునిక సౌకర్యాలతో ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..