Andhra Pradesh: తెలుగును కాపాడుకునేందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి.. ప్రభుత్వ తీరుపై మాజీ ముఖ్యమంత్రి ఫైర్

|

Aug 29, 2022 | 12:58 PM

వైసీపీ (YCP) ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష కనుమరుగవుతోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా...

Andhra Pradesh: తెలుగును కాపాడుకునేందుకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి.. ప్రభుత్వ తీరుపై మాజీ ముఖ్యమంత్రి ఫైర్
Chandrababu
Follow us on

వైసీపీ (YCP) ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష కనుమరుగవుతోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న మనం తెలుగును విస్మరిస్తున్నామని అన్నారు. మాతృ భాషను కాపాడుకునేందుకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియంను పూర్తిగా తొలగిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తెలుగు (Telugu Language) భాష మనగడ కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ఆ ప్రకటన విన్నప్పటి నుంచి బాధగా ఉందని, భాషా ప్రాతిపదికన దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం నిజంగా దారుణమని అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పించారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతున్న తెలుగు అకాడమీ పేరు మార్చి తెలుగు, సంస్కృత అకాడమీగా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ పాలనలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి ఏపీ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్ధను ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

మరోవైపు.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేర్చిన ఘనత ఆయకే సొంతమని కొనియాడారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..