Chandrababu-PM Modi: గుండెల్లో దాచినా దాగని భావోద్వేగం.. ఆనంద భాష్పాలతో కళ్లు చెమ్మగిల్లిన ఉద్విగ్న క్షణం.. ఆసక్తికర వీడియో..

|

Jun 12, 2024 | 1:13 PM

అభిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య.. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు.. "నారా చంద్రబాబు నాయుడు అనే నేను.." అంటూ ఆయన ప్రమాణం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జయజయధ్వానాలతో హోరెత్తిపోయింది. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది.

Chandrababu-PM Modi: గుండెల్లో దాచినా దాగని భావోద్వేగం.. ఆనంద భాష్పాలతో కళ్లు చెమ్మగిల్లిన ఉద్విగ్న క్షణం.. ఆసక్తికర వీడియో..
Chandrababu Modi
Follow us on

అభిమానులు, కార్యకర్తల కేరింతలు, హోరెత్తిన చప్పట్ల మధ్య.. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు.. “నారా చంద్రబాబు నాయుడు అనే నేను..” అంటూ ఆయన ప్రమాణం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జయజయధ్వానాలతో హోరెత్తిపోయింది. కేసరపల్లి IT పార్క్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్డీయే నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబులో ఉద్వేగం చాలా చాలా స్పష్టంగా కనిపించింది. బాబు వెన్నుతడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు.. ఆయన కళ్లు చెమర్చాయి. ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. మోదీకి ధన్యవాదాలు చెప్పి చంద్రబాబు తిరిగి తన స్థానానాకి వెళ్లే వరకూ వేదికపై ఓ అపూర్వ సన్నివేశం కనిపించింది.

వీడియో చూడండి..

మళ్లీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగుపెడతానని చేసిన ప్రమాణం నిజమైన వేళ.. కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో ప్రమాణం చేస్తున్న వేళ.. ఈ భావోద్వేగ సన్నివేశం చాలా స్పెషల్ అనే చెప్పాలి. చావోరేవో అన్నట్టుగా జరిగిన ఎన్నికల రణక్షేత్రంలో అత్యంత భారీ మెజార్టీతో కూటమి విజయం సాధించడం.. ఇప్పుడు అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణస్వీకార ఘట్టం జరగడంతో.. 3 పార్టీల నేతలు, అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..