Chandrababu: అందుకే విలీన గ్రామాలను తెలంగాణలో కలపమంటున్నారు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విలీన గ్రామాల ప్రజల డిమాండ్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే

Chandrababu: అందుకే విలీన గ్రామాలను తెలంగాణలో కలపమంటున్నారు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu

Updated on: Jul 24, 2022 | 3:17 PM

Chandrababu Naidu on AP Govt: ఆంధ్రాలో కలిపిన విలీన గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్ వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.. గోదావరి వరదల నాటినుంచి పోలవరం, విలీన గ్రామాలపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల ప్రజల డిమాండ్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే ఇలా జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. నమ్మకం కోల్పోవడంతో తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదల నాటినుంచి 14రోజులుగా కరెంటు, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్లు శుభ్రపరిచేందుకు నీళ్లు లేని దుర్భర పరిస్థితిలో విలీన గ్రామాల ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. వరద, బురద, కూలిన చెట్లను తొలగించి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నాలు కూడా జరగట్లేదని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి మాని ప్రజా సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు.. జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..