Chandrababu – Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాపై స్పెషల్ ఫోకస్.. చంద్రబాబు, పవన్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ రెండ్రోజులపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్డు మార్గాన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ రెండ్రోజులపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఉమ్మడిగా రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్డు మార్గాన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు గణేష్‌చౌక్ సెంటర్‌లో రాత్రి రోడ్ షో నిర్వహిస్తా రు. చంద్రబాబు, పవన్ కలిసి తొలిసారి ఉమ్మడిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. దాంతో వీరిద్దరి పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.
అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం
చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో టీడీపీ, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అభ్యర్థులకు కొందరు సహకరించడంలేదనే ప్రచారం ఉంది. వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. తామిద్దరం కలిసి పర్యటిస్తున్నామని.. కేడర్ కూడా కలిసి పనిచేయాలని పిలుపునివ్వనున్నారు.
అంబాజీపేట, అమలాపురంలో బహిరంగ సభలు
గురువారం అమలాపురం, పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఉభయగోదావరిజిల్లాల నేతలతో సమీక్షిస్తారు. అంతా కలిసి పనిచేయావలసిన అవసరం, అసంతృప్తులు, కొందరు నేతల ఒంటెద్దు పోకడలపై చర్చించనున్నారు. కూటమి అభ్యర్థులు పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్లాలని సూచించనున్నారు. ఆ తర్వాత అంబాజీపేట, అమలాపురంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు.
చంద్రబాబు-పవన్ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తుందా? టికెట్ దక్కని నేతలు ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా? చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..