Andhra Pradesh: పంచాయతీలకు గుడ్ న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..

|

Aug 20, 2024 | 8:14 PM

చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల బలోపేతం దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల కోసం భారీగా నిధులు విడుదల చేస్తూ శుభవార్త చెప్పింది. స్థానిక సంస్థల బలోపేతం దిశగా ఈ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: పంచాయతీలకు గుడ్ న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..
Pawan Kalyan -Chandrababu
Follow us on

చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల బలోపేతం దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల కోసం భారీగా నిధులు విడుదల చేస్తూ శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల చేశారు. ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది.. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు.. అర్బన్‌ పరిధిలో రూ.454 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం సూచనల మేరకు నిధులు విడుదల చేసినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. తాము మాత్రం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల చెప్పారు.

నిధులు విడుదలైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ నిధుల ద్వారా స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసలుబాటు కలుగుతుందన్నారు పయ్యావుల కేశవ్. గ్రామాల అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమన్న బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని మంత్రి పయ్యావుల చెప్పారు.

మరోవైపు పంచాయతీరాజ్‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈసమావేశానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, అధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవవేతనం పెంపుపై ఈ భేటీలో చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు మొబైల్‌ యాప్‌ తీసుకువస్తున్నట్లు చెప్పారు. అలాగే స్థానిక సంస్థల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుఉంటే.. పోటీకి అనర్హత నిబంధనను తొలగిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..