AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో హైస్పీడ్ రోడ్ కారిడార్.. ఈ రాష్ట్రాల గుండా నేరుగా అమరావతికి కనెక్టివిటీ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీలో హైస్పీడ్ రోడ్డు కారిడార్‌పై ముందడుగు పడింది. ఖరగ్ పూర్-అమరావతి కారిడార్ అలైన్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ 457 కిలోమీటర్లు ఏపీలో ఉంటుంది. ఐదు రాష్ట్రాల గుండా వెళుతుంది. త్వరలో డీపీఆర్ సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: ఏపీలో హైస్పీడ్ రోడ్ కారిడార్.. ఈ రాష్ట్రాల గుండా నేరుగా అమరావతికి కనెక్టివిటీ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Amaravathi Corridor
Venkatrao Lella
|

Updated on: Aug 24, 2026 | 6:42 PM

Share

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఖరగ్ పూర్-అమరావతి హైస్పీడ్ రోడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 1107 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆలైన్‌మెంట్‌ను కేంద్రం ఆమోదించింది. ఏపీలో 457 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.32 వేల కోట్లుగా నిర్ణయించగా.. నాలుగు లైన్లుగా దీనిని నిర్మించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ నుంచి మొదలుకానున్న ఈ కారిడార్.. ఉత్తరాంధ్ర నుంచి అమరావతిని కనెక్ట్ చేస్తుంది. నాలుగు రాష్ట్రాల గుండా ఈ కారిడార్ వెళ్లనుండగా.. ఏపీలో 457 కిలోమీటర్లు ఉంటుంది. ఏపీలో ఈ ప్రాజెక్టుకు రూ.32 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో భూసేకరణ

గోదావరి జిల్లాలు, గిరిజన ప్రాంతాల గుండా ఈ ప్రాజెక్ట్ అమరావతిని కనెక్ట్ చేయనుంది. ఏపీలో ఈ కారిడార్‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ, అలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. పశ్చిమబెంగాల్‌లో మొదలుకానున్న ఈ ప్రాజెక్ట్.. జార్ఖండ్, ఒడిశా మీదుగా ఏపీకి చేరుకుంటుంది. ఏపీలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి అమరావతిలోని ఔటర్ రింగ్ రోడ్డులో కలుస్తుంది. కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, జంగారెడ్డి గూడెం, దేవరపల్లి, ద్వారకా తిరుమల, నూజివీడు మీదుగా ఆగిరిపల్లి వద్ద అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కలుస్తుంది. ఏపీలో ఐదు జిల్లాల్లో దీని కోసం భూసేకరణ చేపట్టనున్నారు. ఈ భూసేకరణ బాధ్యతలను జాయింట్, డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించారు.

మొత్తం రూ.75,629 అంచనా వ్యయం

ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.75,629 కోట్లు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కూడా అలైన్‌మెంట్‌పై క్లారిటీ రానుంది. ఆ రెండు రాష్ట్రాల్లో స్పష్టత వచ్చాక డీపీఆర్ ఖరారు చేయనున్నారు. ఏపీలో 90 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయనున్నారు. ఇప్పటికే పార్వతీపురం మన్యం, తూర్పుగోదారి జిల్లాల్లో భూసేకరణకు రంగం సిద్దమైంది. భూసేకరణ అధికారులను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు వివరాలు పంపించారు. ఈ వివరాలతో త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. త్వరలో మిగిలిన జిల్లాల అధికారుల పేర్లను కూడా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత భూసేకరణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. అనంతరం టెండర్లు ఖరారు చేశాక నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి అమరావతికి కనెక్టివిటీ మరింత పెరగనుందని చెప్పవచ్చు.

Follow Us