Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు..

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకా బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు..
Ys Avinash Reddy

Updated on: Jan 23, 2023 | 9:59 PM

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకా బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణఖు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా నరికి చంపారు దుండగులు. వివేకా హత్య కేసు నాటి నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. కోర్టు, కేసులు, దోషులు, సాక్షులు, సీబీఐ విచారణ, ఇతర రాష్ట్రాలకు కేసు బదలాయించడం ఇలా ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. వివేకా హత్య పొలిటికల్‌గానూ పెను సంచలనం సృష్టించింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఇప్పటికీ ఈ కేసు కొలిక్కి రాలేదు. తాజాగా వైఎస్ అవినాష్‌ను ఈ కేసులో విచారించనున్నారు సీబీఐ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..