Andhra Pradesh: దొండవాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు ప్రయాణికులు గల్లంతు..! ఎట్టకేలకు..

| Edited By: Jyothi Gadda

Nov 08, 2023 | 9:29 AM

Prakasam: గత రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి... పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి... నాగులుప్పలపాడు మండలం కొత్తకోట - హనుమాపురం దగ్గర ఉన్న దొండవాగుకు వరద ఉధృతి ఎక్కువగా వచ్చింది... అయితే ఇది గమనించని గోగినేని హనుమంతరావు అనే వ్యక్తి కారును వాగు దాటించేందుకు ప్రయత్నించాడు...

Andhra Pradesh: దొండవాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు ప్రయాణికులు గల్లంతు..! ఎట్టకేలకు..
Car Washed Away
Follow us on

ప్రకాశం జిల్లా, నవంబర్08; ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం హనుమాపురం దగ్గర దొండవాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది… వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కారును వాగు దాటించేందుకు ప్రయత్నించడంతో నీళ్ల వేగానికి కారు కొట్టుకుపోయింది… కొద్దిదూరం కొట్టుకుపోయిన తరువాత అక్కడ వాగు లోతు తక్కువగా ఉండటంతో ఆ కారు అక్కడే ఆగిపోయింది… వెంటనే కారులో ఉన్న గోగినేని హనుమంతరావు అనే వ్యక్తి కారు నుంచి బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు… తొలుత కారు వాగులో కొట్టుకు పోతున్న విషయాన్ని స్థానికులు ఎవరూ గమనించలేదు… అయితే వాగు పక్క నుంచి వెళుతున్న దారిలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో వాగులో కొట్టుకుపోయిన కారు కోసం స్థానికులతో కలిసి పోలీసులు గాలించారు… ఎట్టకేలకు కొద్ది దూరంలో కారు కనిపించడం, అందులో ఉన్న గోగినేని హననుమంతరావు అనే వ్యక్తితో మరో వ్యక్తి ఇద్దరూ కారు నుంచి బయటపడి చెట్లను పట్టుకుని కేకలు వేయడాన్ని గమనించారు… దీంతో వీరిద్దరిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నారు..

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు… పొంగుతున్న వాగులు…

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి… పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి… నాగులుప్పలపాడు మండలం కొత్తకోట – హనుమాపురం దగ్గర ఉన్న దొండవాగుకు వరద ఉధృతి ఎక్కువగా వచ్చింది… అయితే ఇది గమనించని గోగినేని హనుమంతరావు అనే వ్యక్తి కారును వాగు దాటించేందుకు ప్రయత్నించాడు…

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది… కొద్దిదూరం కొట్టుకుపోయిన తరువాత వాగు లోతు తక్కువగా ఉన్న చోట కారు ఆగిపోవడంతో కారులో ఉన్న హనుమంతరావు సురక్షితంగా బయటపడ్డాడు… వాగులో చిక్కుకున్న కారును బయటకు తీసేందుకు ప్రోక్లయిన్‌తో ప్రయత్నిస్తున్నారు… వర్షాలు కురిసే సమయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల దగ్గర బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా పోలీసులను స్థానికులు కోరుతున్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..