Andhra Pradesh: విశాఖ వందనం.. సీఎంకు స్వాగతం పలకడానికి జేఏసీ చేస్తున్న కార్యక్రమం ఇదే..

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకి మారుస్తున్న నేపథ్యంలో వికేంద్రీకరణ జేఏసీ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఘనంగా స్వాగతం పలకడానికి కార్యక్రమాలను రూపొందించింది. ఈ నెల 15వ తేదీన విశాఖ వందనం పేరుతో నగరంలోని ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున బీచ్ రోడ్ లో పండుగ లాంటి వాతావరణాన్ని సృష్టించాలని, కార్నివాల్, ర్యాలీలతో ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించింది.

Andhra Pradesh: విశాఖ వందనం.. సీఎంకు స్వాగతం పలకడానికి జేఏసీ చేస్తున్న కార్యక్రమం ఇదే..
Vizag

Edited By: Shiva Prajapati

Updated on: Oct 08, 2023 | 7:25 AM

విశాఖపట్నం, అక్టోబర్ 7: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకి మారుస్తున్న నేపథ్యంలో వికేంద్రీకరణ జేఏసీ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఘనంగా స్వాగతం పలకడానికి కార్యక్రమాలను రూపొందించింది. ఈ నెల 15వ తేదీన విశాఖ వందనం పేరుతో నగరంలోని ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున బీచ్ రోడ్ లో పండుగ లాంటి వాతావరణాన్ని సృష్టించాలని, కార్నివాల్, ర్యాలీలతో ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలకాలని నిర్ణయించింది. ఈ మేరకు 15వ తేదీ కార్యక్రమాల కోసం నేటి నుంచి ప్రచార కార్యక్రమాన్ని, అందుకోసం ఏకంగా ఒక ప్రచార రథాన్ని ప్రారంభించింది జే ఏ సీ. అందులో భాగంగా ఈరోజు దేవాలయాల దర్శనాల పేరుతో నగరంలోని సంపత్ వినాయక దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిపాలన రాజధానిగా విశాఖ వర్ధిల్లాలని ప్రార్థన చేశారు. అక్కడ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో పలువురు కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్లి అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థన చేశారు.

ఈనెల 15వ తేదీ నుంచి వరుసగా ముఖ్యమంత్రి వచ్చేవరకు నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. అందులో మొదటిది అక్టోబర్ 15న బీచ్ రోడ్ లో కార్నివాల్, ర్యాలీలతో పాటు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతుంది జేఏసీ. అనంతరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు. కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు రాజధాని వస్తే కలిగే ప్రయోజనాలు వివరించడంతోపాటు చదువుకున్న వెంటనే ఉపాధి లభించేందుకు రాజధాని ఒక వేదిక కాగలదన్న భావాన్ని నింపే ప్రయత్నం చేస్తామని జేఏసీ నేతలు చెప్తున్నారు. మరొకవైపు ఒక్క విద్యాసంస్థ లే కాకుండా రైతు బజార్లు, మార్నింగ్ వాకింగ్ ట్రాక్ లకు వెళ్ళడం, జన సమూహాలు ఉన్నచోటకు వెళ్లి అందరిలో అవగాహన కల్పించి అందర్నీ భాగస్వామ్యం చేస్తామని జెఎసి చెప్తుంది.

జేఏసీ అధ్వర్యంలోనే కార్యక్రమాలు ఎందుకు?

ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ కి సంబంధించి ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో స్వయంగా ముఖ్యమంత్రి నే ప్రస్తావించిన తర్వాత ఆ నిర్ణయాన్ని ఘనంగా స్వాగతిస్తూ భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని జేఏసీ మళ్లీ తెరపైకి వచ్చింది. అంతకుముందు సరిగ్గా ఏడాది కిందట అమరావతి రైతులు అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో గత నవంబర్లో జేఏసీ ఏర్పాటు అయింది. విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. నాన్ పొలిటికల్ జేఏసీగా రూపుదిద్దుకున్న ఈ సంస్థకు ప్రధానంగా అధికార పార్టీ అండదండలు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని వర్గాలని కలుపుకోవాలన్న ప్రయత్నాన్ని జేఏసీ చేస్తూనే వస్తుంది. గత అక్టోబర్ 15వ తేదీన విశాఖ గర్జన పేరుతో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని, ఆ తర్వాత ఉత్తరాంధ్ర మొత్తం మీద తిరుగుతూ అన్ని ప్రాంతాల్లో రాజధాని పట్ల అవగాహన పెంచామని జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ టీవీ9 కి తెలిపారు. రాజధాని వస్తే ట్రాఫిక్ పెరుగుతుందని ప్రస్తుతం ఉన్న ప్రశాంతత కరువవుతుందని అపోహలు సృష్టిస్తున్నారని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని, ఒక్కసారి రాష్ట్రానికి విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర భవిష్యత్తు బంగారం అవుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరిగి వలసలు ఆగిపోతాయని తద్వారా ఉత్తరాంధ్ర గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందన్న భావం ప్రజలందరిలో ఉందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారని అందులో భాగంగానే విశాఖ వందనం పేరుతో 15 నుంచి కార్యక్రమాలు చేస్తున్నామని దానికోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక రధాని కూడా ప్రారంభిస్తున్నట్లు లజపతిరాయ్ టీవీ9తో పంచుకున్నారు

ఇవి కూడా చదవండి

రాజధాని వచ్చే వరకూ కార్యక్రమాలు..

ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మాత్రమే షిఫ్ట్ అవుతుందనిz రాజధాని మార్పుకు మరికొంత సమయం పడుతుందన్న జేఏసీ పరిపాలన రాజధానిగా పూర్తిస్థాయి పాలన విశాఖ నుంచే కొనసాగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ చెబుతున్నారు. న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి అండదండగా ఉంటూ రాజధాని విశాఖకు మారేవరకు తమ కార్యక్రమాలు కొనసాగుతాయని జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ చెప్తున్నారు. అదే సమయంలో తాము ఇతర ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకం కాదని విశాఖ పరిపాలన వేదిక గా రాష్ట్రం అంతటా అభివృద్ధి చెందాలన్నదే తమ ఆభవతమన్నారు జేఏసీ చైర్మన్. అది సాధ్యమవుతుందని ఆ కల నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నది ఆయన విశ్వాసం.

మొత్తానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం షిఫ్ట్ దాదాపు ఖరారు కావడమే కాకుండా అందుకు తగ్గ ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో జేఏసీ మళ్ళీ ఒకసారిగా ఊపందుకోవడంతో పాటు, విశాఖ వందనం లాంటి కార్యక్రమాలతో ముందుకు వస్తుండడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..