AP TET – 2022: ఫలితాలపై వీడని ఉత్కంఠ.. అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులు

|

Sep 14, 2022 | 1:28 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు నిరాశే ఎదురవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా టెట్‌ రిజల్ట్స్...

AP TET - 2022: ఫలితాలపై వీడని ఉత్కంఠ.. అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులు
AP TET- 2022
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు నిరాశే ఎదురవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా టెట్‌ రిజల్ట్స్ నేడు (బుధవారం) రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పటివరకు ఫైనల్ కీ రానేలేదు. ఈ నెల 12నే ఫైనల్‌ ‘కీ’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని నోటిఫికేషన్ తెలిపినా ఇప్పటివరకు రిలీజ్ అవలేదు. అయితే ఫైనల్ కీ ఇవాళ విడుదల అవుతాయని అధికారులు తెలిపారు. ఫైనల్ కీనే ఇవాళ విడుదలైతే రిజల్స్ట్ రావడానికి మరింత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. అధికారుల తీరుతో టెట్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. 2018లో టెట్‌ (TET-2022) నిర్వహించగా మళ్లీ ఈ ఏడాది మాత్రమే నిర్వహించారు. సుదీర్ఘ కాలం తర్వాత నోటిఫికేషన్‌ రిలీజ్ కావడంతో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో 5.25 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఆన్ లైన్ విధానంలో జరిగిన పరీక్షలకు కేంద్రాలు లభించలేదు. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ పరిణామాల కారణంగా ఈసారి టెట్‌ రాసిన వారి సంఖ్య తగ్గిపోయింది. చాలా మంది అభ్యర్థులు రెండు పరీక్షలకు ఫీజులు కట్టారు. అంతే కాకుండా ఈ ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల్లోని టీచర్లకూ టెట్‌ సర్టిఫికెట్‌ ఉండాలనే నిబంధన పెట్టడంతో ఎక్కువ మంది టెట్‌ రాసేందుకు ముందుకొచ్చారు. కానీ అధికారుల తీరుతో వారు అసహనానికి గురయ్యారు. కాగా..0 ఆంధ్రప్రదేశ్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET 2022) పరీక్షలు ముగిశాయి. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఏపీ టెట్‌ పరీక్షలు ఆగస్టు 21వరకు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 5,25,789 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ నిర్వహణకు దాదాపు150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.

టెట్‌ ఫైనల్‌ ‘కీ’ విడుదల అయిన తరువాత పేపర్ల నార్మలైజేషన్‌ ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే టెట్‌ ఫలితాలు ఇంకో వారం వరకూ రాకపోవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..