AP Criem News: ఈ మధ్యకాలంలో మాయగాళ్లు పెరిగిపోయారు. తప్పులు చేసేందుకు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ముసుగులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల్లా కనిపిస్తూ.. అమాంతం దోచుకెళ్లుపోతున్నారు. ఇస్మార్ట్ ఐడియాలతో పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరు(Krosuru)లో పట్టపగలే ఓ బైక్ చోరీ స్థానికంగా కలకలం రేపింది. సాధువు వేషంలో భిక్షాటనకు వచ్చి బైక్ దొంగిలించుకుని వెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో బాధితులు స్థానిక పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. బైక్‌కు వీలు చిక్కింది దాన్ని దోచుకుని వెళ్లిపోయాడు. అదే ఇంకాస్త అనువుగా ఉంటే ఇళ్లు గుళ్లచేసి పోయేవాడు. అందుకే ఎవరైనా కాషాయం దుస్తుల్లో వస్తే.. కొంగొత్త దేవుడంటూ కాళ్ల మీద పడకుండా.. కాస్త వెనకా ముందు ఆలోచించండి. భక్తి ఉండటంతో తప్పులేదు.. కానీ ఇలా దొంగతనాలు, మేజిక్స్ చేసే బాబాలు, సాధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే సర్వం దోచుకెళ్లిపోతారు. తస్మాత్ జాగ్రత్త.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..