Byreddy Rajasekhar Reddy: సీమకు అసలైన విలన్లు సినిమా వాళ్లే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..
తెలుగు సినీ పరిశ్రమకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమ జోలికి రావొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో రాయలసీమ పేరు చెబితే భయపడే పరిస్థితులు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు...
తెలుగు సినీ పరిశ్రమకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమ జోలికి రావొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో రాయలసీమ పేరు చెబితే భయపడే పరిస్థితులు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. సినిమా వాళ్ల వల్లే రాయలసీమకు ఈ చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. సీమ ప్రజలను హంతకులుగా, విలన్లుగా చూపిస్తున్నారన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. రాయలసీమ ప్రజలకు దాహమేస్తే రక్తం తాగుతారని చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు రాయలసీమనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారని ప్రశ్నించారు. తమపైనే ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తు్న్నారని ఫైర్ అయ్యారు. కొండారెడ్డి బురుజు దగ్గర ఆ నరుకుడు సీన్లు ఏంటన్న బైరెడ్డి.. మీ లాభం కోసం సీమ ప్రజలందర్నీ చెడ్డవాళ్లుగా మార్చేస్తారా అని తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. సీమకు అసలైన విలన్లు సీనిమా వాళ్లేనని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు.
రాయలసీమ జోలికి రావొద్దు. దేశంలో రాయలసీమ పేరు చెబితే భయపడే పరిస్థితులున్నాయి. దీనికి కారణం సినిమా వాళ్లే. సీమ ప్రజలను హంతకులుగా, విలన్లుగా చూపిస్తున్నారు. సినిమా వాళ్లకు మేమే దొరికామా. మాపైనే ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. రాయలసీమలో అసలు విలన్లు సినిమావాళ్లు. రాజకీయ నేతలే.
– బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
కాగా.. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు అభివృద్ధికి సహకరించకపోతే వారికి పతనం తప్పదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. కృష్ణానదిపై రెండు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే తీగల వంతెనతో రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదన్న ఆయన. దాని స్థానంలో బ్యారేజి నిర్మిస్తే 70 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..