SBI ATM Robbery: సీసీ టీవీ ధ్వంసం చేసి మరీ ఏటీఎంలో రూ. 65లక్షలు దొంగతనం చేసిన దుండగులు.. ఎక్కడంటే

|

Aug 30, 2021 | 11:08 AM

SBI ATM Robbery: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎం నుంచి డబ్బులు దొంగలించడానికి..

SBI ATM Robbery: సీసీ టీవీ ధ్వంసం చేసి మరీ ఏటీఎంలో రూ. 65లక్షలు దొంగతనం చేసిన దుండగులు.. ఎక్కడంటే
Sbi Chori
Follow us on

SBI ATM Robbery: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏటీఎం నుంచి డబ్బులు దొంగలించడానికి దుండగలు గ్యాస్ కట్టర్, గడ్డపారలను ఉపయోగించారు. వీటి సాయంతో రెండు ఏటీఎం మిషన్స్ నుంచి నగదుని దొంగలించారు. అయితే దుండగులు దొంగతనం చేసే సమయంలో అది సీసీటీవీలో రికార్డ్ కాకుండా వాటిని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎం లో ఉన్న నగదుకు సంబంధించిన వివరాలను బ్యాక్ అధికారులు తెలిపారు. సుమారు రూ 65 లక్షల రూపాయల వరకు నగదు ఉండవచ్చునని.. బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు ప్రారంభించారు.  ఫింగర్ ప్రింట్ ఆధారంగా డాగ్ స్క్వాడ్ లతో తనిఖీ చేస్తున్నారు.

 

Also Read: చరిత్ర అంటే ఇష్టం అంటూ తన పిల్లలకు చైనా రెడ్డి, రష్యా రెడ్డి.. వంటి పేర్లు పెట్టిన వింత తండ్రి.. ఎక్కడంటే

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం.. ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.

ఓటీటీ వార్.. పోటీపడి మరీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ హీరోల సినిమాలు..