Andhra Pradesh: రమ్య హత్య కేసులో ముగిసిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటన.. నివేదికలో కీలక విషయాలు..!

|

Aug 24, 2021 | 6:30 PM

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో నిజ నిర్ధారణకై రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది.

Andhra Pradesh: రమ్య హత్య కేసులో ముగిసిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటన.. నివేదికలో కీలక విషయాలు..!
National Sc Commission
Follow us on

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కేసులో నిజ నిర్ధారణకై రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించింది ఎస్సీ కమిషన్ బృందం. అలాగే మృతురాలు రమ్య కుటుంబ సభ్యులతోనూ ఈ బృందం సభ్యులు చర్చించారు. అతిథి గృహంలో పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. కాగా, రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్ దేర్ ప్రకటించారు. కుటుంబ సభ్యులు, వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపారు. రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని, రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ తెలిపారు. కాగా, రమ్య హత్యకు సంబంధించి నివేదిక రూపొందించిన ఈ బృందం సభ్యులు.. నివేదికను ఎస్సీ కమిషన్‌కు సమర్పిస్తారు. కాగా, బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో దర్యాప్తు అధికారుల పనితీరు బాగుందని జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పేర్కొంది. యువతి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించిందని కమిషన్ బృందం పేర్కొంది.

గుంటూరు నగరానికి చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యను శశి కృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. చివరికి తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో.. రమ్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఈ కేసులో నిందితుడు శశికృష్ణను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, దళిత యువతి రమ్య హత్యను సీరియస్‌గా తీసుకున్న ఎస్సీ కమిషన్.. నిజ నిర్ధారణ కోసం ఓ బృందాన్ని ఏపీకి పంపించింది. ఈ బృందం రెండు రోజుల పర్యటించి.. అధికారులు, మృతురాలి బంధువులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి సమాచారన్ని సేకరించింది. 21న ఏపీ పర్యటనకు వచ్చిన ఎస్సీ కమిషన్ బృందం.. ఇవాళ్టితో తన పర్యటను ముగించింది.

Also read:

Motorola Edge 20: భారత మార్కెట్లోకి మోటరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. కెమెరా క్లారిటీ ఎంతో తెలిస్తే ఫిదా కావాల్సిందే.

Meera Mithun: మీరా మిథున్‏కు మరోసారి షాక్.. దళితులపై విమర్శల విషయంలో కోర్టు తీర్పు ఏంటంటే..

Telangana Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న మూడు గంటల పాటు దంచికొట్టనున్న వాన..