
విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు సూపర్ అంటూ కొనియాడారు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని అన్నారు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు బ్రిటన్ సహకారం అందిస్తుందన్నారు. ఈ కాన్సెప్ట్ యూకేలో ఎప్పట్నుంచో అమలవుతోందని చెప్పారు. సేమ్ కాన్సెప్ట్‌ను ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక బాగుందన్నారు. మొత్తంగా విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేస్తోన్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయన్నారు ఓవెన్.
దాంతో, వైద్యారోగ్య రంగంలో ఏపీ చేపట్టిన సంస్కరణలు, తీసుకుంటోన్న చర్యలను బ్రిటీష్ బృందానికి వివరించారు సీఎం జగన్. ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్ వీసాలు ఇప్పించాలని కోరారు. సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించారు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్. విద్యారంగంలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఓవెన్. ఏపీ కోరితే టీచర్స్ ట్రైనింగ్‌లో భాగస్వాములమవుతామన్నారు. ఇవేకాకుండా… ఐటీ, పరిశోధనా రంగాలపైనా ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఈ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఓవెన్. ఏపీలో అభివృద్ధి చేస్తోన్న పారిశ్రామిక పార్కుల పురోగతిని బ్రిటన్ బృందానికి వివరించిన సీఎం జగన్… ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. వ్యవసాయ రంగంలో ఏపీ ఇంప్లిమెంట్ చేస్తోన్న వినూత్న విధానాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్.
CMను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ Gareth Wynn Owen. విద్య, వైద్య రంగాలలో ఏపీ కృషిపై ప్రశంసలు. యూకేలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ఇక్కడ తీసుకురావడంపై అభినందనలు. ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్ వీసాలు ఇప్పించడంపై సమావేశంలో చర్చ. @UKinIndia @UKinHyderabad pic.twitter.com/4Q9R0QNqyJ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 14, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..