Andhra Pradesh: పాముని చూసి తన యజమానిని అలెర్ట్ చేసిన కుక్క.. తన ప్రాణాలకు తెగించి మరీ పాముపై దాడికి యత్నం..

| Edited By: Ravi Kiran

Aug 04, 2023 | 9:00 AM

కుక్క ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుందని.. చివరికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన యజమాని క్షేమం కోసం ఆరాటపడుతుందని అనేక సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా మరోసారి కుక్క తన యజమాని .. వారి కుటుంబ సభ్యుల పట్ల తనకున్న విశ్వాసాన్నీ ప్రదర్శించిన ఘటన ఒకటి కర్నూలు జిల్లాల్లో చోటు చేసుకుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని కుటుంబాన్ని పాము కాటుకు గురి కాకుండా కాపాడి విశ్వాసం చాటుకుంది పెంపుడు కుక్క.

Andhra Pradesh: పాముని చూసి తన యజమానిని అలెర్ట్ చేసిన కుక్క.. తన ప్రాణాలకు తెగించి మరీ పాముపై దాడికి యత్నం..
Dog Vs Snake
Follow us on

పెంపుడు జంతువుల్లో కుక్క విశ్వాసానికి మారు పేరు. తమ ఇంట్లో సభ్యుల్లా భావించి కుక్కలను పెంచుకుంటారు. ఆ ప్రేమని దృష్టిలో పెట్టుకుని పెట్టిన చేతిని మరచిపోని విశ్వాసం కుక్కది అని చెప్పడానికి అనేక ఉదంతాలున్నాయి. తమ యజమాని కోసం కుక్క ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుందని.. చివరికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన యజమాని క్షేమం కోసం ఆరాటపడుతుందని అనేక సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా మరోసారి కుక్క తన యజమాని .. వారి కుటుంబ సభ్యుల పట్ల తనకున్న విశ్వాసాన్నీ ప్రదర్శించిన ఘటన ఒకటి కర్నూలు జిల్లాల్లో చోటు చేసుకుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని కుటుంబాన్ని పాము కాటుకు గురి కాకుండా కాపాడి విశ్వాసం చాటుకుంది పెంపుడు కుక్క. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని రాధాకృష్ణ కాలనీలో నివాసముంటున్న టీచర్ నరసింహులు తన ఇంట్లో ఓక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. గురువారం రాత్రి సమయం లో ఇంటి వెలుపల నుంచి ఓ పెద్ద తాచుపాము ఇంట్లోకి వస్తుండడం ఆ ఇంటి పెంపుడు కుక్క గమనించింది. పాముని గమనించిన కుక్క వెంటనే ఏకధాటిగా అరవడం మొదలు పెట్టింది. తమ కుటుంబ సభ్యులను హెచ్చరించడం మొదలు పెట్టింది. ఆ అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా అక్కడ ఉన్న పామును చూసి భయాందోళన గురయ్యారు. ఆ కుటుంబ సభ్యులపై పాము ఎక్కడ దాడి చేస్తుందో అని ఆ పెంపుడు కుక్క పాము పై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది.

దీంతో ఆ పాము తప్పించుకొని ఇంటి ప్రధాన గేటు మీద ఎక్కి కూర్చొని బుసలు కొట్టింది. భారీ నాగ పాముని చూసి ఆ కుటుంబ సభ్యులు మొత్తం భయంతో వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో ఇంటి దగ్గరకు చేరుకున్న స్నేక్ కేచర్ ఆ పాము ను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో  కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం తాము పెంచుకున్న కుక్క వల్లే ఈ రోజు ఆ పాము నుండి తప్పించుకోగలిగామని, లేదంటే పెద్ద ప్రమాదానికి గురయ్యే వారి మని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..