AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాచరిక వైభవానికి ప్రతీక.. బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలకు పూజలు

చారిత్రక బొబ్బిలి కోటలో ఆయుధ పూజ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్‌లో రాజవంశీయులు ఆయుధ పూజను ప్రతి సంవత్సరంలానే ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా బొబ్బిలి రాజవంశ ఆచారాలు ఆచారాలు కొనసాగుతున్నాయి. బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం పలికారు.

రాచరిక వైభవానికి ప్రతీక.. బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలకు పూజలు
Bobbili Royal Family
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2026 | 8:34 PM

Share

రాజాధిరాజా అంటూ సేవకులు రాజావారి కోటలో కవాతు చేశారు. కత్తులు, కటార్లు, డాళ్లు, బరిసెలు, తుపాకీలు చేతపట్టుకుని కదం తొక్కారు. అదే సమయంలో వజ్ర వైడూర్యాలు పొదిగిన తలపాగా, ఆభరణాలు, రత్నాలు పొదిగిన కత్తులతో, రాజరిక దుస్తులు ధరించి సంప్రదాయబద్ధంగా కోట లోపల నుండి బయటకు వచ్చారు బొబ్బిలి రాజవంశీయులు. అలా వచ్చిన రాజవంశీయులకు అక్కడున్న వారంతా ఘన స్వాగతం పలికారు.

ఆచార వ్యవహారాలు, మేళతాళాలతో రాజవంశీయులు హుందాగా ముందుకు నడుస్తుండగా.. సేవకులు వారిని దర్బార్ మహల్ కి తోడ్కొని వెళ్లారు. సింహాసనంపై దివంగత రంగారావు ఫోటో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నేటికీ రాచరికానికి నిలువుటద్దంలా ప్రతిబింభించే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చారు.

విజయదశమి సందర్భంగా బొబ్బిలి కోటలో జరిగే ఆయుధ పూజ అందరినీ ఆకట్టుకుటుంది. చారిత్మాత్మక బొబ్బిలి యుద్ధం 1757లో జరిగింది. యుద్ధం జరిగి వందల సంవత్సరాలు అయినా నాటి జ్ఞాపకాలు మాత్రం నేటికీ మిగిలే ఉన్నాయి. ఆ తరువాత రోజుల్లో బొబ్బిలి వారసులు తిరిగి తమ రాజ్యాన్ని పునర్ నిర్మించుకున్నారు. అప్పటి నుండి బొబ్బిలి వారసులు నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను శౌర్య పరాక్రమాలకు చిహ్నంగా భద్రపరిచారు. వాటి కోసం దర్బార్ హల్ లో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచారు.

అలా భద్రపరిచిన ఆయుధాలను ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా బయటకు తీసి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయుధ పూజను బొబ్బిలి రాజవంశీయుల వారసులైన మాజీమంత్రి రావు సుజయ కృష్ణ రంగారావు బహుదూర్, ఆయన సోదరుడు ఎమ్మెల్యే బేబి నాయనలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఈసారి ఆయుధపూజ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకున్నామన్నారు బొబ్బలి రాజవంశీయులు, ఎమ్మెల్యే బేబీ నాయన. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఆయుధపూజ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులు, రాజ్యాలు కనుమరుగైనా.. నాటి సాంప్రదాయాలను బొబ్బిలి రాజవంశీయులు ఇప్పటికీ కొనసాగిస్తూ ఆచారాలను పాటిస్తున్నారు.

Follow Us
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?
ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?
పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..
పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..
ఇలా చేస్తే ఒక్క పీస్ కూడా మిగల్చకుండా భలే ఇష్టంగా తింటారు..
ఇలా చేస్తే ఒక్క పీస్ కూడా మిగల్చకుండా భలే ఇష్టంగా తింటారు..
బ్యాచిలర్స్‌కు బెస్ట్ రెసిపీ.. గార్లిక్ పెప్పర్ చికెన్
బ్యాచిలర్స్‌కు బెస్ట్ రెసిపీ.. గార్లిక్ పెప్పర్ చికెన్
ఈ ముగ్గురి భవిష్యత్తును న్యూజిలాండ్ సిరీస్ మారుస్తుందా ?
ఈ ముగ్గురి భవిష్యత్తును న్యూజిలాండ్ సిరీస్ మారుస్తుందా ?
బోర్డుపై ఉన్న రోడ్డు బొమ్మను చూసి భ్రమపడ్డ డ్రైవర్..
బోర్డుపై ఉన్న రోడ్డు బొమ్మను చూసి భ్రమపడ్డ డ్రైవర్..
 కరీనా కపూర్ నైట్‌టైమ్ రొటీన్ వైరల్.. పాదాలకు నెయ్యి ఎందుకు?
 కరీనా కపూర్ నైట్‌టైమ్ రొటీన్ వైరల్.. పాదాలకు నెయ్యి ఎందుకు?
చికెన్, మటన్ లేకపోయినా.. నాన్ వెజ్ రుచితో గుమగుమలాడే వెజ్ కర్రీ!
చికెన్, మటన్ లేకపోయినా.. నాన్ వెజ్ రుచితో గుమగుమలాడే వెజ్ కర్రీ!