AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 నిమిషాల్లో కొత్తిమీర కారం.. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదిరిపోద్ది!

కొత్తిమీర కారం.. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఇది కేవలం ఐదు నిమిషాల్లో సులభంగా తయారుచేసుకోగలిగే ఒక ప్రత్యేకమైన సౌత్‌ ఇండియన్ వంటకం. సాధారణ రెసిపీలకు భిన్నంగా ఈ కారం ఎంతో రుచిగా, కమ్మగా ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Oct 19, 2026 | 7:41 PM

Share
కావాల్సిన పదార్థాలు.. కొత్తిమీర: 1 పెద్ద కప్పు (సుమారు 30 రూపాయల కట్ట), ఎండుమిర్చి: 10-18 (రుచికి సరిపడా), పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు: 10-20, ధనియాలు: 1 1/2 టీస్పూన్లు, జీలకర్ర: 1 టీస్పూన్, పెద్ద ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది), ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: 1/4 టీస్పూన్, చింతపండు: చిన్న రెక్క (పులుపు కోసం, ఐచ్ఛికం), నూనె: వేయించడానికి, తాలింపు కోసం, శెనగపప్పు: 1 టీస్పూన్, మినపపప్పు: 1 టీస్పూన్, ఆవాలు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, కరివేపాకు రెబ్బలు: 1, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు: 4.. చొప్పున తీసుకోవాలి.

1 / 5
ముందుగా 30 రూపాయల కొత్తిమీర కట్టను తీసుకుని, ఆకులను వేరు చేసి నీట్ గా శుభ్రం చేసుకోవాలి. సన్నటి ఇసుక కూడా పోయేలా మంచి నీటిలో రెండు మూడు సార్లు కడగాలి. శుభ్రపరిచిన కొత్తిమీరను సన్నగా తరిగి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది సుమారు ఒక కప్పు అవుతుంది.  స్టవ్‌ వెలిగించి ఒక పాన్ పెట్టి, అందులో 1 1/2 టీస్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. అవి చక్కగా పండు పండుగా వేగితే రుచి మరింత పెరుగుతుంది. వేగిన వాటిని చల్లారబెట్టడానికి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి, 10 నుండి 18 ఎండుమిర్చిని వేయాలి. మిర్చి మాడిపోకుండా చిన్న మంటపై వేపాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత, 10 నుండి 20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఎండుమిర్చితో పాటు దోరగా వేపాలి. వెల్లుల్లి వాసన, రుచిని ఇవ్వడమే కాకుండా కారం నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు చల్లారిన తర్వాత ఖాళీ మిక్సీ జార్‌లో వేయాలి. దీనికి ముందుగా వేపిన ధనియాలు, జీలకర్రను కూడా జత చేయాలి. ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి మిక్సీ జార్‌లో వేయాలి. తగినంత ఉప్పు, పావు చెంచా పసుపు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉల్లిపాయ వేయడం వల్ల పేస్ట్‌ మెత్తగా అవుతుంది. కావాలంటే ఒక చుక్క నీళ్లు వేసి రుబ్బుకోవచ్చు. కొద్దిగా చింతపండు కూడా కలిపితే పుల్లపుల్లగా, కారం కారంగా బాగుంటుంది.

3 / 5
అదే పాన్‌లో మీకు అవసరమైతే మరికొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక శెనగపప్పు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపాలి. ఒక కరివేపాకు రెబ్బ, నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఈ తాలింపులోకి ముందుగా గ్రైండ్‌ చేసుకున్న ఉల్లిపాయ-ఎండుమిర్చి పేస్ట్‌ను వేసి చిన్న మంటపై వేపాలి. మంట ఎక్కువగా పెడితే పేస్ట్‌ మాడిపోయి రుచి కోల్పోతుంది. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని చక్కగా వేపాలి. పేస్ట్‌ బాగా వేగిన తర్వాత, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేయాలి. కొత్తిమీర, ఉల్లిపేస్ట్‌, ఎండుమిర్చి పేస్ట్‌లో చక్కగా కలిసేలా చిన్న మంటపై రెండు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేవరకు వేపాలి. మూత పెట్టి కూడా రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఒక్క చుక్క నీళ్లు కూడా పోయకుండా ఇలా వేపడం వల్ల కారం చాలా రుచిగా తయారవుతుంది.

4 / 5
స్టవ్‌ కట్టేసి, వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర కారాన్ని, కొద్దిగా నెయ్యి వేసుకుని, ఒక ఉల్లిపాయ ముక్కతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కమ్మటి సువాసనతో కడుపు నిండా తినాలనిపిస్తుంది. తప్పనిసరిగా మీరు ఈ రెసిపీని ప్రయత్నించండి.

5 / 5
Follow Us