AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: ఏటీఎం మెషిన్ కీప్యాడ్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..? వారెర్వా.. అసలు సీక్రెట్ ఇదా..

యూపీఐ విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ఏటీఎం ఉపయోగించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఏటీఎం మెషిన్ కీప్యాడ్ చూస్తే మెటల్ బటన్లు ఉంటాయి. ప్లాస్టిక్ లేదా రబ్బర్ బటన్లను ఉపయోగించకుండా కేవలం మెటల్ బటన్లను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారనే డౌట్ చాలామందిలో ఉంటుంది.

ATM: ఏటీఎం మెషిన్ కీప్యాడ్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..? వారెర్వా.. అసలు సీక్రెట్ ఇదా..
Atm
Venkatrao Lella
|

Updated on: Oct 19, 2026 | 8:35 PM

Share

యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరుగుతున్నా ఇప్పటికీ ఏటీఎం లావాదేవీలు చాలామంది నిర్వహిస్తున్నారు. ఫోన్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు లేదా ఫోన్ పనిచేయనప్పుడు అత్యవసరంగా నగదు అవసరమైన సమయంలో సమీపంలోని ఏటీఎంకు వెళుతుంటారు. తమ డెబిట్ కార్డును ఏటీఎం మెషిన్‌లో పెట్టి పిన్ నెంబర్ ఎంటర్ చేసి నగదు విత్ డ్రా చేసుకుంటారు. అయితే మీరు పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఏటీఎం మెషిన్ కీప్యాడ్ చూస్తే మెటల్ బటన్లు ఉంటాయి. ఈ బటన్లను లోహంతో తయారుచేస్తారు. దీంతో ప్లాస్టిక్, రబ్బర్ బటన్లను పెట్టకుండా మెటల్ బటన్లను మాత్రమే అన్ని ఏటీఎం మెషిన్లను ఎందుకు ఉపయోగిస్తారనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీనికి సమాధానం ఇందులో చూద్దాం.

ప్లాస్టిక్, రబ్బర్ బటన్లు ఎందుకు ఉయోగించరు..?

ఏటీఎం మెషిన్లకు రబ్బర్ లేదా ప్లాస్టిక్ బటన్లను ఉపయోగించకుండా మెటల్ బటన్లను మాత్రమే ఉపయోగించడం వెనుక ఒక రహస్యం ఉంది. మీ ఏటీఎం పిన్‌ వేరేవారికి తెలియకుండా కాపాడటంలో మెటల్ బటన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్లాస్టిక్, రబ్బర్ బటన్లను ఉపయోగిస్తే మోసాలకు పాల్పడేవారు మీ డెబిట్ కార్డు పిన్ నెంబర్‌ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎలా అంటే రబ్బర్ లేదా ప్లాస్టిక్ బటన్లు వేళ్ల నుంచి వచ్చే వేడిని గ్రహిస్తాయి. దీని వల్ల థర్మర్ కెమెరాలను ఉపయోగించి మీ పిన్ నెంబర్‌ను మెసగాళ్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. థర్మర్ కెమెరాలు ఉష్ణ సంకేతాలను సలువుగా గుర్తించగలవు. వేడిని గుర్తించి స్క్రీన్‌పై ఎరువు రంగులో ప్రదర్శిస్తాయి. దీని వల్ల మీ ఏటీఎం పిన్‌ను కనిపెట్టి మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్మును కాజేసే అవకాశముంటుంది. అందుకే భద్రతలో భాగంగా ప్లాస్టిక్ లేదా రబ్బర్ బటన్లను ఉపయోగించరు. మన వేళ్లల్లో భౌతిక ఉష్ణం ఉంటుంది. మనంప్లాస్టిక్ లేదా రబ్బరును తాకినప్పుడు శరీర ఉష్ణం తాత్కాలికంగా ఆ ఉపరితలంపైకి విడుదల అవుతుంది. దీని వల్ల వేరేవాళ్లు పిన్ నెంబర్ కనుక్కొవచ్చు.

మెటల్ బటన్ల ఉపయోగం వెనుక రహస్యమిదే..

ఇక మెటల్ బటన్ల విషయానికొస్తే.. లోహలు ఉష్ణ వాహకాలు. అంటే అవి వేడిని ఎక్కువసేపు ఉంచలేవు. మీ వేళ్ల నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా ఉపరితలాన్ని చల్లగా ఉంచుతాయి. మీరు బటన్ల మీద నుంచి వేళ్లను తీసేయగానే ఉష్ణ సంకేతం సున్నాకు మారుతుంది. దీని వల్ల మీరు ఏ బటన్లను తాకారనేది థర్మర్ కెమెరా గుర్తించలేదు. ఈ కారణంతో ఏటీఎం మెషిన్లకు మెటల్ బటన్లను ఉపయోగిస్తున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటీఎంలకు మెటల్ బటన్లను ఉపయోగిస్తున్నారు. మీ ఏటీఎం పిన్ వేరేవారికి తెలియకుండా భద్రతను కల్పించడానికి మెటల్ బటన్లు ఉపయోగపడతాయి.

Follow Us
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?
ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?
పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..
పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..
ఇలా చేస్తే ఒక్క పీస్ కూడా మిగల్చకుండా భలే ఇష్టంగా తింటారు..
ఇలా చేస్తే ఒక్క పీస్ కూడా మిగల్చకుండా భలే ఇష్టంగా తింటారు..
బ్యాచిలర్స్‌కు బెస్ట్ రెసిపీ.. గార్లిక్ పెప్పర్ చికెన్
బ్యాచిలర్స్‌కు బెస్ట్ రెసిపీ.. గార్లిక్ పెప్పర్ చికెన్
ఈ ముగ్గురి భవిష్యత్తును న్యూజిలాండ్ సిరీస్ మారుస్తుందా ?
ఈ ముగ్గురి భవిష్యత్తును న్యూజిలాండ్ సిరీస్ మారుస్తుందా ?
బోర్డుపై ఉన్న రోడ్డు బొమ్మను చూసి భ్రమపడ్డ డ్రైవర్..
బోర్డుపై ఉన్న రోడ్డు బొమ్మను చూసి భ్రమపడ్డ డ్రైవర్..
 కరీనా కపూర్ నైట్‌టైమ్ రొటీన్ వైరల్.. పాదాలకు నెయ్యి ఎందుకు?
 కరీనా కపూర్ నైట్‌టైమ్ రొటీన్ వైరల్.. పాదాలకు నెయ్యి ఎందుకు?
చికెన్, మటన్ లేకపోయినా.. నాన్ వెజ్ రుచితో గుమగుమలాడే వెజ్ కర్రీ!
చికెన్, మటన్ లేకపోయినా.. నాన్ వెజ్ రుచితో గుమగుమలాడే వెజ్ కర్రీ!