Viral Video: బోర్డుపై ఉన్న రోడ్డు బొమ్మను చూసి భ్రమపడ్డ డ్రైవర్.. నేరుగా ట్రక్కును తీసుకెళ్లి..
గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ నదులు, చెరువుల్లోకి వాహనాలు దూసుకెళ్లిన సంఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. కానీ ఇక్కడ జరిగిన సీన్ తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడో ట్రక్ డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న హోర్డింగ్‌పై ఉన్న పెయింటింగ్‌ను చూసి అదే నిజమైన రోడ్డు అనుకొని నేరుగా దానిపైకి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్ ప్రాణాలతో తప్పించుకున్నాడు.

రోడ్డు అనుకొని ఓ ట్రక్కు డ్రైవర్ హోర్డింగ్‌ను ఢీకొట్టిన సంఘటన ఢిల్లీ- డెహ్రాడూన్ హైపై జరిగింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ–డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన ఓ భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే దానిపై అచ్చం హైవే నిర్మాణం తరహాలో సహజమైన పెయింటింగ్‌ను వేశారు.
అయితే రాత్రి సమయంలో అటుగా వచ్చి ఓ భారీ ట్రక్కు డ్రైవర్.. ఈ హోర్డింగ్‌పై వేసిన ఆర్ట్ పెయింటింగ్‌ను నిజమైన రోడ్డు అనుకుని నేరుగా దానిపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా.. డ్రైవర్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన డ్రైవర్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.
అయితే ఈ ప్రమాదం తర్వాత డెహ్రాడూన్‌లోని ఈ ఆశారోడి–మొహబ్బేవాళా మధ్య ఉన్న 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే గత ఆరు నెలల్లో ఇక్కడ 12కి పైగా భారీ ప్రమాదాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
सरकार अपने प्रचार के लिए सड़कों पर होर्डिंग लगवाती है, भुगतना पब्लिक को पड़ता है।
दिल्ली-देहरादून एक्सप्रेसवे पर लगी होर्डिंग में सड़क की ऐसी तस्वीर बनाई, ट्रक ड्राइवर असली रास्ता समझ बैठा। उसने ट्रक होर्डिंग में घुसा दिया
#dehradoon #roadaccident https://t.co/t3iaIrHodP
— Shivaji Mishra (@askshivaji27) October 19, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
