AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడుకుంటూ కిందపడిన బాలుడు.. నోటిలోకి దూసుకెళ్లిన ఇనుప కడ్డీ! ఆ తర్వాత..

ఇంటి సమీపంలో ఆడుకుంటూ కిందపడిన ఐదేళ్ల బాలుడి నోటిలోకి ఇనుపరాడ్‌ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి చేరిన బాలుడికి వైద్యులు సుమారు 40 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి ఇనుపరాడ్‌ను విజయవంతంగా తొలగించారు. వైద్యుల సమయస్ఫూర్తితో బాలుడి ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటన చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది..

ఆడుకుంటూ కిందపడిన బాలుడు.. నోటిలోకి దూసుకెళ్లిన ఇనుప కడ్డీ! ఆ తర్వాత..
Iron Rod Pierces Childs Mouth While Playing
Srilakshmi C
|

Updated on: Oct 19, 2026 | 7:51 PM

Share

గుజరాత్‌, అక్టోబర్ 19: ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడికి అనూహ్య ప్రమాదం ఎదురైంది. ఆడుకుంటూ కిందపడటంతో ఇనుపరాడ్‌ నోటిలోకి దూసుకెళ్లింది. దీంతో బాలుడు తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడాడు. అయితే, వైద్యులు సుమారు 40 నిమిషాల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లోని పటాన్‌ జిల్లాలో ఉన్న సామి తాలూకా వేద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

వేద్‌ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అదుపుతప్పి నేలపై పడిపోయాడు. అక్కడ ఉన్న ఇనుపరాడ్‌ నేరుగా బాలుడి నోటిలోకి గుచ్చుకుంది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సాయంతో బాలుడిని రాధన్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాలుడిని పరీక్షించిన వైద్యులు.. ఇనుపరాడ్‌ దంతాలు, దవడకు సమీపంలో లోతుగా ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. దవడకు, చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి నష్టం కలగకుండా రాడ్‌ను తొలగించడం వైద్యులకు సవాలుగా మారింది. దీంతో ప్రత్యేక చికిత్స కోసం ప్రైవేట్‌ డెంటల్‌ సర్జన్‌ సహకారాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రైవేట్‌ వైద్యులు కలిసి శస్త్రచికిత్స బృందంగా ఏర్పడి చికిత్స ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

సుమారు 40 నిమిషాల పాటు జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించి ఇనుపరాడ్‌ను విజయవంతంగా తొలగించారు. దవడకు, ఇతర కణజాలాలకు తీవ్ర నష్టం కలగకుండా వైద్యులు ఆపరేషన్‌ను పూర్తి చేశారు. దీంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సందర్భంగా డెంటిస్ట్‌ డాక్టర్‌ డీఎస్‌ సోధా తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలు ఇంటి బయట, ఖాళీ ప్రదేశాల్లో లేదా నివాస సముదాయాల్లో ఆడుకునేటప్పుడు వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ప్రమాదకరమైన ఇనుపరాడ్లు, పదునైన వస్తువులు ఉన్న ప్రాంతాల్లో పిల్లలు ఆడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సకాలంలో స్పందించిన 108 అత్యవసర సేవలు, రాధన్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రైవేట్‌ వైద్యుల సమన్వయంతో ఐదేళ్ల బాలుడి ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటన చిన్నపిల్లలు ఆడుకునే పరిసరాల్లో భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.

Follow Us