AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యావేత్తల ముసుగులో చైనా ఏజెంట్లు.. మన ఆర్మీ అధికారి భార్య నుంచి రక్షణ రహస్యాల సేకరణ

అటు పాకిస్థాన్‌ హనీట్రాప్‌, ఇటు చైనా నిఘా వల. భారత్‌ను టార్గెట్‌ చేసేందుకు శత్రుదేశాలు కొత్త కొత్త దారులు వెతుకుతున్నాయా? హనీట్రాప్‌తో మన నేవీ అధికారులను వలలో వేసుకున్నట్టు.. ఇప్పుడు మేధావుల ముసుగులో చైనా స్పై ఆపరేషన్‌ను విస్తరిస్తోందా? తెలంగాణకు చెందిన ఆర్మీ మేజర్ భార్య ద్వారా డిఫెన్స్ సీక్రెట్స్‌ను తస్కరించిందా ? ఆమె ఫోన్‌లో భారత సైనిక వ్యూహాలకు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నాయా.? చైనా లింకులపై అనుమానాలు ఎందుకొచ్చాయి? ఏఐని అడ్డం పెట్టుకుని గూఢచర్యం జరిగిందన్న ఆరోపణల్లో నిజమేంటి?

విద్యావేత్తల ముసుగులో చైనా ఏజెంట్లు..  మన ఆర్మీ అధికారి భార్య నుంచి రక్షణ రహస్యాల సేకరణ
Chinese Agents Case
Ram Naramaneni
|

Updated on: Oct 19, 2026 | 8:10 PM

Share

దేశ రక్షణ రహస్యాలు.. బోర్డర్ సెక్యూరిటీ, సైనిక యాక్టివిటీకి సంబంధించిన సమాచారం.. శత్రుదేశాల చేతికి చిక్కితే ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే శత్రుదేశాలు మన దేశ రహస్యాలను తెలుసుకునేందుకు అనేక మార్గాల్లో వల వేస్తుంటాయి. పాకిస్తాన్ హనీట్రాప్‌ చేసినట్టు, చైనా కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించి మన సీక్రెట్స్‌ను తస్కరించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు జమ్మూలో వెలుగుచూసిన వ్యవహారంలోనూ ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. విద్యావేత్తలుగా పరిచయం చేసుకున్న కొందరు వ్యక్తులు.. ఓ సీనియర్ ఆర్మీ అధికారి భార్యను సంప్రదించి, వ్యాసాల పేరుతో మన డిఫెన్స్‌కు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ఎవరో కాదు మన తెలంగాణకు చెందిన వ్యక్తే. ఆమె భర్త సీనియర్ ఆర్మీ అధికారి కాగా.. ప్రస్తుతం జమ్మూలోని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్నారు. విదేశీ నిఘా వర్గాలతో సంబంధాలున్న వ్యక్తులు విద్యావేత్తల ముసుగులో ఆమెను సంప్రదించారని, మొదట పర్యావరణం, అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై వ్యాసాలు రాయాలని కోరినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత క్రమంగా రక్షణ రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారని దర్యాప్తులో తేలింది.

ఈ నెల 14న జమ్మూతావి రైల్వే స్టేషన్‌ దగ్గర, పఠాన్‌కోట్‌ వెళ్లేందుకు స్టేషన్‌కు చేరుకున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గరున్న మొబైల్‌ ఫోన్‌, ఇతర డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆమె ఫోన్‌లో భారత్‌-ఇటలీ రక్షణ సంబంధాలపై జరిగిన సమావేశ వివరాలు.. భారత సైన్యాధిపతి అమెరికా పర్యటనకు సంబంధించిన కార్యాచరణ.. భారత్‌-రష్యా రక్షణ ఒప్పందాలు.. సైనిక వ్యూహమైన కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌ పత్రాలు.. ఇలా రక్షణ రంగానికి సంబంధించినవి ఉండటం. అంతేకాదు.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కలై-2, కమలా జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, అస్సాంలోని ప్రాజెక్టులు, భారత్‌-చైనా సరిహద్దు అంశాలకు సంబంధించిన సమాచారమూ ఉన్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ వ్యవహారాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమెకు, విదేశీ పరిచయాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. బెంగళూరు యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ.. జెనీవాలో ఉన్నత చదువులు.. ఢిల్లీలోని డిఫన్స్ అధ్యయన సంస్థలో ఇంటర్న్‌షిప్‌.. ఐక్యరాజ్యసమితిలో ఐటీ ఇంటర్న్‌షిప్‌ చేశారామె. ఈ క్రమంలో చైనా జాతీయులతో పాటు పలువురు విదేశీయులతో వాట్సాప్‌ సంభాషణలు జరిపినట్లు సమాచారం. మలేసియాలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న కొందరితో ఆమె టచ్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలీ సమాచారాన్ని ఎందుకు సేకరించారు? ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు మమ్మరమంది.

Follow Us