AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. అధికారమే లక్ష్యంగా భారీ ప్లాన్.. ఎక్కడా తగ్గేదేలే అంటూ..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ పూర్తి ఫోకస్ చేస్తోంది. అధికారమే లక్ష్యంగా భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడే దిశగా...

Andhra Pradesh: ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. అధికారమే లక్ష్యంగా భారీ ప్లాన్.. ఎక్కడా తగ్గేదేలే అంటూ..
Ap Bjp
Shiva Prajapati
|

Updated on: Sep 19, 2022 | 7:58 AM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ పూర్తి ఫోకస్ చేస్తోంది. అధికారమే లక్ష్యంగా భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో దీనిపై బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల చేపట్టిన జలం కోసం జనయాత్రకు మంచి స్పందన వచ్చిందని, దీంతో ఈసారి రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆ పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరో యాత్రకు రాష్ట్ర బిజేపీ శ్రీకారం చుట్టబోతోంది. ఈ భారీ యాత్రకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వం వహిస్తారు.

దీంతో పాటు బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఇందులో మోదీ ప్రజా పాలన, జగన్ ప్రజా కంఠక పాలనకున్న తేడాలను జనానికి వివరిస్తామని అంటున్నారు బీజేపీ నేతలు.

సెప్టెంబరు 17నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నారు. అలాగే సెప్టెంబరు 25వ తేదీన దీన్ దయాళ్ జయంతి నిర్వహిస్తామన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాల పై బీజేపీ అక్టోబర్ 5 వరకు కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీజేపీ సొంతంగా తన శక్తి పెంచుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు కమలనాథులు.

వీధి వీధిన బీజేపీ పేరుతో.. అన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళతామన్నారు. ఏపీలో పొత్తులపైనా క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తులు ముడి పెడుతూ ఎవరో ఏదో రాస్తే తాము పట్టించుకోబోమని అంటున్నారు కమలం నాయకులు. ప్రస్తుతం పొత్తుల అంశంపై స్పదించాల్సిన అవసరమే లేదంటున్నారు.

ఇప్పటికే క్షేత్ర స్థాయిలో బీజేపీ బాగా పుంజుకుందనీ.. అందుకు కారణం ఏపీ బీజేపీ నేతల పోరాటమేననీ. తమ పోరాటం‌ వల్ల అనేక ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చారని అంటున్నారు కాషాయదళం నాయకులు. రాయలసీమ, పల్నాడులో కూడా ఈ తరహా యాత్ర చేపడతామన్నారు. ప్రాజెక్టు లు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. 175 నియోజకవర్గాలలో పోరాట కార్యక్రమం చేస్తామన్నారు. త్వరలో ఈ యాత్రలపై కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..