Andhra Pradesh: పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ భయపెడుతోంది.. పొత్తులపై టీడీపీ నేతల విసుర్లు.. జీవీఎల్‌ కౌంటర్‌

|

Apr 21, 2023 | 7:44 AM

వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ వ్యాఖ్యలు తాజాగా కొత్త చర్చకు తెరతీశాయి. అయితే.. ఆయన కామెంట్స్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక కామెంట్స్‌ చేశారు. బీజేపీకి, వైసీపీకి సంబంధం లేదని ప్రజలు అనుకోవాలంటూ అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు.

Andhra Pradesh: పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ భయపెడుతోంది.. పొత్తులపై టీడీపీ నేతల విసుర్లు.. జీవీఎల్‌ కౌంటర్‌
Atchannaidu, Pawan
Follow us on

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఏపీలో అప్పుడే ఎలక్షన్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. పొత్తుల విషయంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పొత్తులపైనా ఎవరికివారు ముందస్తు ప్రణాళికలు రచించడలో బిజీగా ఉన్నారు ప్రధాన పార్టీల నేతలు. ఏ పార్టీ ఎటువైపు అనే అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. టీడీపీ- బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ వ్యాఖ్యలు తాజాగా కొత్త చర్చకు తెరతీశాయి. అయితే.. ఆయన కామెంట్స్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక కామెంట్స్‌ చేశారు. బీజేపీకి, వైసీపీకి సంబంధం లేదని ప్రజలు అనుకోవాలంటూ అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. మరోవైపు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. జనసేన టీడీపీతోనే ఉందన్న పితాని కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

 

ఇక.. పితాని వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీలో తమది ప్రతిపక్ష పాత్ర అని, వైసీపీతో ఎలాంటి సంబంధాల్లేవని చెప్పుకొచ్చారు. బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నదే తమ టార్గెట్ అన్నారు జీవీఎల్‌. మొత్తంగా.. ఏపీ రాజకీయాల్లో ఎలక్షన్ మూడ్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీల డైలాగ్‌ వార్‌తో పొత్తుల రాజకీయం రంజుగా మారుతోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పొత్తుల విషయంలో బీజేపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్‌ పెంచుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..