Visakhapatnam: రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టి రిక్షా తొక్కిన బీజేపీ ఎంపీ జీవీఎల్.. వీడియో వైరల్
గత కొద్ది రోజులుగా విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వేయని వేషం లేదు. కట్టి పట్టి కుస్తీ చేయడం దగ్గర నుంచి హరిదాసుగా నెత్తిన కలశం పెట్టుకోవడం నుంచి రిక్షా తొక్కడం వరకు సంక్రాంతి అంతా తానే అన్నట్టుగా జీవిఎల్ చేస్తున్నారు. విశాఖ లోక్ సభకు పోటీ చేయాలన్న ఆలోచనతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. స్వతహాగా జీవీఎల్ సెఫాలజిస్ట్, స్ట్రాటజీస్ట్ కూడా. అందులో భాగంగా సంక్రాంతిని ఘనంగా నిర్వహించి అందరి మన్ననలు..

విశాఖపట్నం, జనవరి 16: గత కొద్ది రోజులుగా విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వేయని వేషం లేదు. కట్టి పట్టి కుస్తీ చేయడం దగ్గర నుంచి హరిదాసుగా నెత్తిన కలశం పెట్టుకోవడం నుంచి రిక్షా తొక్కడం వరకు సంక్రాంతి అంతా తానే అన్నట్టుగా జీవిఎల్ చేస్తున్నారు. విశాఖ లోక్ సభకు పోటీ చేయాలన్న ఆలోచనతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. స్వతహాగా జీవీఎల్ సెఫాలజిస్ట్, స్ట్రాటజీస్ట్ కూడా. అందులో భాగంగా సంక్రాంతిని ఘనంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలన్న లక్ష్యంతో జీవిఎల్ మహా సంక్రాంతి సంబరాలతో రంగంలోకి దిగారు. మామూలుగా కాదు.. భారీగా, ఏకంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఐదు ఎకరాల్లో బాహుబలి సెట్‌ను మైమరిపించే విధంగా ఒక సెట్ వేయించారు. అందులో ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణాన్ని తలంపించే విధంగా ఎద్దుల బండ్లు, మేలిమి జాతి ఎడ్లు, పూరిల్లు, ముగ్గుల లోగిళ్ళు, కర్రసాము, హరికథా దాసులు.. లాంటి 30కి పైగా కళా బృందాలను తీసుకొచ్చి జనవరి 12 నుంచి నేటి వరకు ధూమ్ ధాం చేశారు.
కేంద్ర మంత్రులు, ప్రసిద్ధ కళాకారులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండులో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు చేస్తున్న సంక్రాంతి సంబరాల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్‌తో పాటు పలువురు ఎంపీలు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొనగా సాంస్కృతిక కార్యక్రమాల్లో మోహన భోగరాజు, సాయి కుమార్‌లతో పాటు పలువురు కళాకారులు, సుప్రసిద్ధ గాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సాంప్రదాయక నృత్యాలను ప్రముఖులు తిలకించారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి దీవించారు. కేంద్ర మంత్రి స్వయంగా కొన్ని పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రిక్షా తొక్కి… కొత్త రిక్షా ఇప్పిస్తానని హామీ ఇచ్చి..
అంగరంగ వైభవంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో కనుమ రోజు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్షావాలాను తన రిక్షా లోనే కూర్చోబెట్టి, ఆ రిక్షాను ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో స్వయంగా జీవీఎల్ తొక్కారు. తర్వాత రిక్షావాలాను అడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. రోజుకు 20 రూపాయలు అద్దె ఇచ్చి రిక్షా తెచ్చుకుంటున్నామని, రిపేర్లు వస్తే మేమే చేయించుకోవాలని రిక్షా వాలా ఆవేదన వ్యక్తం చేయగా.. బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తానని, స్వంతంగా రిక్షా కొనిస్తానని జీవీఎల్ హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








