Andhra Pradesh: బిగ్ బ్లాస్టింగ్ న్యూస్.. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాక్? రహస్య సమావేశం అందుకేనా
శివప్రకాశ్‌జీ కీలక నేతలకు పలు సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని.. ఇక పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్లు సమాచారం.. 25 ఎంపీ, 175 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై.. కసరత్తు చేయాలని ఏపీ బీజేపీ నేతలకు శివప్రకాశ్‌జీ ఆదేశించారని.. పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాకిచ్చింది.. కూటమికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అయితే, ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో బీజేపీ హైకమాండ్ చర్చించింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో బీజేపీ హైకమాండ్ బిజీగా ఉండటంతో.. మరో నాలుగైదు రోజుల్లో ఏపీ పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఈ క్రమంలోనే.. హైదరాబాద్ శివార్లలో బీజేపీ నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేయడం పొత్తు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ నగర శివార్లలో బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్‌జీ నేతృత్వంలో జరుగుతున్న ఈ కీలక భేటీకి 10 మంది ముఖ్యనేతలు హాజరైనట్లు సమాచారం.. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భేటీలో పొత్తు సహా పలు అంశాలపై చర్చించిన నేతలు.. టీడీపీ-జనసేన తీరుపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. పొత్తులపై చర్చలు జరుపుతూనే సీట్లు ప్రకటించడంపై అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం.. ఎన్డీయేలో చేరికపై తేల్చని చంద్రబాబు తీరుపై కూడా అటు అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు పార్టీలో చర్చించి మళ్లీ చెబుతామని అమిత్ షాకు చెప్పి.. మళ్లీ బీజేపీతో చర్చలకు ముందుకురాకపోవడంపై బీజేపీ నాయకత్వం ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడు సీట్ల ప్రకటన, చంద్రబాబు తీరుతో బీజేపీలో పొత్తుపై పునరాలోచన జరగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా.. శివప్రకాశ్‌జీ కీలక నేతలకు పలు సూచనలు కూడా చేశారని తెలుస్తోంది. పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని.. ఇక పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్లు సమాచారం.. 25 ఎంపీ, 175 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై.. కసరత్తు చేయాలని ఏపీ బీజేపీ నేతలకు శివప్రకాశ్‌జీ ఆదేశించారని.. పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
వీడియో చూడండి..
ఇదిలాఉంటే.. బీజేపీ నిర్ణయంతో జనసేన పార్టీ ఇరకాటంలో పడుతుందని ప్రచారం జరగుతోంది. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ తాజా వ్యూహాలతో జనసేన ఎటువైపు ? బీజేపీని వదిలి టీడీపీ వైపు జనసేన ఉంటుందా ? టీడీపీని కాదని బీజేపీతో కొనసాగుతారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇంకా పొత్తులపై బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో.. నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..