AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel BJP: బీజేపీ సంచలన నిర్ణయం.. బద్వేల్ అభ్యర్థిగా దళిత యువకుడు రమేష్ పనతాల. నేడే అధికారిక ప్రకటన

బద్వేల్ బరి నుంచి టీడీపీ తప్పుకుంది.. జనసేన పోటీ చేయనంది. భారతీయ జనతాపార్టీ మాత్రం ముందడుగు వేస్తోంది.

Badvel BJP: బీజేపీ సంచలన నిర్ణయం..  బద్వేల్ అభ్యర్థిగా దళిత యువకుడు రమేష్ పనతాల. నేడే అధికారిక ప్రకటన
Badvel Bjp Candidate
Venkata Narayana
|

Updated on: Oct 06, 2021 | 12:05 PM

Share

BJP Badvel Candidate: బద్వేల్ బరి నుంచి టీడీపీ తప్పుకుంది.. జనసేన పోటీ చేయనంది. భారతీయ జనతాపార్టీ మాత్రం ముందడుగు వేస్తోంది. దీనిపై కేడర్‌ను సన్నద్ధం చేస్తున్న ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఏపీ బీజేపీ నుంచి బద్వేల్ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా రమేష్ పనతాల పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ గా 14 సంవత్సరాలు పనిచేసిన అనుభవం.. తరువాత 2 సంవత్సరాలు బీ.జే.వై.ఎమ్ నేషనల్ సెక్రటరీగా పనిచేసిన రమేష్‌కు సంఘ్ పరివార్‌తో పరిచయాలు కూడా ప్లస్ పాయింట్ గా నిలిచాయని తెలుస్తోంది. బద్వేల్ అభ్యర్థిగా రమేష్ పనతాలను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేడు ప్రకటించబోతున్నారు.

కాగా, బద్వేలు ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందిన వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉపఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్‌ దాసరి సుధను వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్థిగా వైసీపీ బరిలో నిలపనుంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్‌ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. అయితే, ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని పోటీ నుంచి వైదొలిగింది.

బద్వేలు(ఎస్సీ రిజర్వుడ్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించి.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నియోజకవర్గంలో 2,04,618 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,02,811 మంది పురుషులు, 1,01,786 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రమేష్ పనతాల పూర్తి బయోడేటా ఇక్కడ చూడండి

Read also: International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, షాకులు.. సంచలనాలు