Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు ఎదురుదెబ్బ.. కడప జిల్లా కలెక్టర్ షాకింగ్ ఆదేశాలు..

|

Aug 03, 2021 | 1:42 PM

Andhra Pradesh: వైసీపీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కడప జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ప్రొద్దుటూరులో..

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు ఎదురుదెబ్బ.. కడప జిల్లా కలెక్టర్ షాకింగ్ ఆదేశాలు..
Ycp Mla Rachamallu
Follow us on

Andhra Pradesh: వైసీపీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కడప జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి నికారించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసిన చోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ధర్నా నిర్వహించారు. ఈ వివాదాల నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, కలెక్టర్ ఉత్తర్వులపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. విగ్రహం ఏర్పాటును నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకున్న ఎమ్మెల్యే రాచమల్లు కుట్రలు భగ్నం అయ్యాయని అన్నారు. బీజేపీ చేసిన పోరాటాల ఫలితంగానే అక్కడ ఎటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది హిందువులు, బీజేపీ కార్యకర్తల విజయం అన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. దేశంలో నివసించే ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని పాటించాలన్నారు. కాదని రాచమల్లు రాజ్యంగం పాటిస్తామంటే.. ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయని ఎద్దేవా చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే మీద, ఇతరుల మీద పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:

Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే…పందికి పాలుపట్టిన ఆవు.. అదికూడా తెలుగు రాష్ట్రంలోనే..

Andhra Pradesh: లేగదూడకు బారసాల ఫంక్షన్.. ఊరందరికీ విందు భోజనం ఏర్పాటు.. ఎక్కడంటే..

Farmers: వ్యవసాయం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న రైతులు.. చూస్తే షాక్ అవుతారు..