Breaking News : చంద్రబాబుకి బిగ్‌ రిలీఫ్, అమరావతి ల్యాండ్ స్కాంపై సీఐడీ విచారణకు స్టే ఇచ్చిన హైకోర్టు

Chandrababu CID case :  సీఐడీ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు

Breaking News :  చంద్రబాబుకి బిగ్‌ రిలీఫ్, అమరావతి ల్యాండ్ స్కాంపై సీఐడీ విచారణకు స్టే ఇచ్చిన హైకోర్టు
Chandrababu
Follow us

|

Updated on: Mar 19, 2021 | 6:26 PM

Chandrababu CID case :  సీఐడీ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. అమరావతి ల్యాండ్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబుకు సీఐడీ విచారణపై హైకోర్టు స్టే విధించింది.

చంద్రబాబు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన సీఐడీ నోటీసులపై టీడీపీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ విచారణ సందర్భంలో హైకోర్టు ఈ మేరకు అదేశాలిచ్చింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు.

చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి విచారణ సందర్భంగా కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు విన్నవించారు.

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాను, టీడీపీ సభ్యులకు వ్యతిరేకంగా పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగంగానే తాజా కేసు నమోదు చేశారని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 12న సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Read also : Tirupati By Election : తిరుపతి బైపోల్స్ లో చంద్రబాబు సరికొత్త వ్యూహం… ఆ నేతలకు కీలక బాధ్యతలు