Big News Big Debate LIVE: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ-జనసేన మధ్య మాటలు యుద్ధం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. సినిమా ఫంక్షన్ల నుంచి సోషల్ మీడియా దాకా నోటికిచ్చినట్టు తిట్టుకుంటూ ఆన్‌లైన్‌లో రంకెలేసుకుంటున్నారు. ఎవరి వెర్షన్ వారిదే. యాక్షన్‌లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. సినిమాల్లో పవర్ స్టార్‌కు, పొలిటికల్‌గా పవర్‌లో ఉన్న స్టార్లకు మధ్య జరుగుతున్న ఈ రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. వైసీపీ హామీలపై తాజాగా జనసేన ఛార్జిషీట్ వేసింది. దీంతో YCP వర్సెస్ జనసేన మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది.
సన్నాసులు.. ప్యాకేజీ స్టార్లు.. దద్దమ్మలు.. పెళ్లాలు.. కులం ఇలా వ్యక్తిగత విమర్శలన్ని అయిపోయాయి.. రాజకీయంగా ఎన్ని అనుకోవాలో.. అంతకుమించే వినిపించాయి. సినిమా ఫంక్షన్‌లో పవర్ స్టార్ రెచ్చిపోతే.. మీడియా ముందు వైసీపీ ప్రశ్నప్రశ్నకు కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. సినిమాలు..టికెట్లు..థియేటర్లు..రేట్లు..! ఏపీ పాలిటిక్స్‌లో పవన్ దుమారం. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ జనసేనాని చేసిన విమర్శలకు స్ట్రౌంగ్ కౌంటర్లు వచ్చాయి. మతుండే మాట్లాడుతున్నావా…? నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఏపీ మంత్రులు.. ఇక పవర్ స్టార్ అభిమానులు… పొలిటికల్ స్టార్ సోల్జర్స్ కూడా ఆన్‌లైన్‌లో యుద్ధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు.
రాజకీయాల్లో విమర్శలు సహజం. విధానాలపై యుద్ధం అనివార్యం. కానీ ఇక్కడ జనసేన- YCP మధ్య వ్యక్తిగత వైరంగా మారుతోంది. ఎవరికి వారు తగ్గేదే లే అంటూ కత్తులు నూరుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో వైసీపీ హామీలను టార్గెట్ చేసింది జనసేన. జగన్ చేసిన వాగ్దానాలు వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలంటూ 19 అంశాలనూ ప్రస్తావించింది. ఇచ్చిన హామీ ఏంటి. ప్రస్తుతం కనిపిస్తున్న నిజమిది అంటూ చార్జిషీట్ పెట్టింది జనసేన.
దీంతో ఆన్‌లైన్‌లో జనసేన ప్రశ్నలకు జగన్ సేనలు సమాధానాలిస్తున్నాయి. ప్యాకేజీ స్టార్లకు పేదలకు అందే పథకాలు కనిపించవా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఏపీలో ఎవరికి వారు తగ్గేదిలే అంటూ మాటకు మాటతో ఆన్ లైన్.. ఆఫ్‌లైన్లో రెచ్చిపోతున్నారు. మరి ఈ రాజకీయ కథా చిత్రానికి శుభం కార్డు ఎప్పుడు పడుతుంది ఎలా పడుతుందో కాలమే చెప్పాలి.?
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది.. వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
Read Also… Telangana: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..